రాంకీ దోపిడీ!
అగ్రిమెంట్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు టిప్పింగ్ ఫీజు 20 రేట్లు పెరిగింది. 2009లోనే చెత్త నిర్వహణను ప్రైవేట్‌కు అప్పగించాలని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కార్మిక సంఘాల వ్యతిరేకతతో అప్పట్లో అమలు కాలేదు.
- ఒప్పందాలకు తూట్లు.. 20 రెట్లు పెరిగిన టిప్పింగ్ ఫీజు
- కాంట్రాక్టు సంస్థకు అడ్డగోలుగా ప్రజాధనం దోచిపెడుతున్న అధికారులు
- జవహర్‌నగర్ విషతుల్యం.. సర్కార్ మీనమేషాలపై స్థానికుల ఆగ్రహం
చెత్త నిర్వహణ సమస్య రోజురోజుకు గుదిబండలా మారుతున్నది. మూడు కార్పొరేషన్ల వ్యర్థాల సేకరణ, రవాణా, శాస్త్రీయ నిల్వ, ప్రాసెసింగ్‌లకు గడిచిన 14 ఏండ్లుగా దాదాపు రూ. 4వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. అయితే ‘ప్రైవేటు’ దందాలో రూ.4 వేల కోట్లకు పైగా ప్రజాధనం కరిగిపోయిందే తప్ప, సమస్య ఎకడ వేసిన గొంగళి అకడే అన్నట్లుగా ఉంది. శాస్త్రీయ పద్ధతిలో చెత్తను శుద్ధి చేయాల్సిన రాంకీ సంస్థ ఒప్పందాలకు తూట్లు పొడుస్తుంటే, పర్యవేక్షించాల్సిన ట్రై కార్పొరేషన్ల అధికారులు సదరు ఆ సంస్థకు అడ్డగోలుగా బిల్లులు చెల్లిస్తూ ‘చెత్త’ రాజకీయానికి తెరలేపాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా చెత్త గుట్టలు పేరుకుపోతుండగా, వాటి నుంచి వెలువడుతున్న విషతుల్య లీచె, మిథేన్ వాయువుల పరిసర ప్రజలకు, పర్యావరణానికి ముప్పుగా మారడం ఆందోళన కలిగించే అంశం.
-సిటీబ్యూరో
సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): అగ్రిమెంట్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు టిప్పింగ్ ఫీజు 20 రేట్లు పెరిగింది. 2009లోనే చెత్త నిర్వహణను ప్రైవేట్‌కు అప్పగించాలని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కార్మిక సంఘాల వ్యతిరేకతతో అప్పట్లో అమలు కాలేదు. చివరకు 2012లో జవహర్‌నగర్‌లో శాస్త్రీయ నిల్వ, నిర్వహణ బాధ్యతలను రాంకీ సంస్థకు అప్పగించారు. 2012లో జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నిర్వహణ బాధ్యతలను రాంకీ సంస్థకు అప్పగించినప్పుడు టన్ను చెత్తకు కేవలం రూ.572 (40 శాతం వాటా) మాత్రమే చెల్లించేవారు.
అప్పట్లో ఏడాదికి రూ.43 కోట్లు ఖర్చయ్యేది. క్రమక్రమంగా చెత్త రవాణాను, 2022లో రోడ్ల ఊడ్చే బాధ్యతలను కూడా రాంకీకి కట్టబెట్టడంతో ఆ సంస్థ ఆడిందే ఆటగా మారింది. టన్ను చెత్తకు టిప్పింగ్ ఫీజు ఏకంగా రూ.2,400 దాటిపోయింది. ప్రస్తుతం నెలకు రూ.65 కోట్లు-అంటే ఏడాదికి దాదాపు రూ.780 కోట్లు రాంకీ ఖాతాలోకి వెళ్తున్నాయి. గడిచిన 14 ఏళ్లలో చెల్లింపులు 20 రెట్లు పెరిగాయి. నగరం నలువైపులా నాలుగు డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తామని ప్రకటనలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి..కనీస కార్యరూపంలోకి తీసుకురాకపోగా సదరు రాంకీ సంస్థకు యథావిధిగా కోట్లాది రూపాయల బిల్లులు విడుదల చేస్తుండటం వెనుక ఆంతర్యమేమిటని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రాసెసింగ్ సున్నా. కొండల్లా చెత్త గుట్టలు!
గ్రేటర్ పరిధిలో నిత్యం సుమారు 11 వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, రాంకీ సంస్థ కేవలం 3 వేల టన్నులు మాత్రమే ప్రాసెస్ చేస్తోంది. ఒప్పందం ప్రకారం విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం పెంచాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. 2016లో రూ.144 కోట్లు వెచ్చించి డంపింగ్ యార్డుకు వేసిన ‘క్యాపింగ్’ పైనే మళ్లీ కొత్తగా చెత్తను పోస్తుండటంతో 135 ఎకరాల విస్తీర్ణంలో విషపు కొండలు వెలిశాయి.
ప్రజల ప్రాణాలతో చెలగాటం
సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ రూల్స్-2016 నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. చెత్త గుట్టల నుంచి వెలువడుతున్న విషతుల్యమైన ‘లీచెట్’ ద్రవం, మిథేన్ వాయువుల వల్ల జవహర్ నగర్ పరిసర ప్రాంత ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. ఇంత జరుగుతున్నా బల్దియా అధికారులు మాత్రం కళ్లు మూసుకుని బిల్లులు పాస్ చేస్తున్నారు. ప్రైవేటీకరణ పేరుతో రవాణా వ్యయం 50 శాతం పెరిగిందే తప్ప, నగరవాసులకు ఒరిగిందేమీ లేదు.
కాగా ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడుతున్న రాంకీ సంస్థపై చర్యలు తీసుకోవాలని, 14 ఏండ్లుగా చెల్లించిన రూ.4 వేల కోట్లపై సమగ్ర ఆడిట్ (విజిలెన్స్ విచారణ) జరిపించాలని పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కమీషన్ల కకుర్తితో ప్రజల సొమ్మును ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తున్న తీరుపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే జవహర్‌నగర్ మరో భోపాల్‌గా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

