ఈ ఐదు ప్రశ్నలకు బదులేది?
డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఒక పక్క కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తున్న వేళ కొత్తబిల్లుపై సమాధానం రావాల్సిన అనేక ప్రశ్నలను మేధావులు, విశ్లేషకులు లేవనెత్తుతున్నారు.
- కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మేధావులు, విపక్షాలు
న్యూఢిల్లీ, నవంబర్ 28: డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఒక పక్క కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తున్న వేళ కొత్తబిల్లుపై సమాధానం రావాల్సిన అనేక ప్రశ్నలను మేధావులు, విశ్లేషకులు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా వారు ఐదు తీవ్ర ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇవి రాబోయే అనేక దశాబ్దాల భారత రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయని వారంటున్నారు. అవి 1. కొత్త జనగణన జరుగుతుండగా 2011 జనగణననే ఎందుకు వాడాలి?, 2. సీట్లలో ‘50 శాతం పెంపు’ రాష్ర్టాల మధ్య ప్రతి భారతీయుడి ఓటు విలువను సమం చేయడం లేదు.
అలాంటప్పుడు నియోజకవర్గాల సంఖ్యను ఎందుకు పెంచాలి?, 3. ఈ ప్రక్రియను అమలు చేసే డీలిమిటేషన్ కమిషన్‌లో ఎవరు ఉంటారు?, 4. రాజ్యసభ బలం లోక్‌సభలో మూడో వంతు కంటే తక్కువ కానున్నది. ఇది రాష్ర్టాల హక్కులను తగ్గించదా?, 5. బీజేపీకి మినహా 816 సీట్లలో పోటీ చేసే వనరులు ఎవరికున్నాయి? అని వారు కేంద్రాన్ని ఘాటుగా నిలదీస్తున్నారు. దేశంలో కొత్త జనగణన జరుగుతుండగా.. 16 ఏండ్ల కిందటి జనగణన గణాంకాలతో ఎందుకు తొందపడుతున్నారు.
సీట్లు పెరిగితే నియోజకవర్గాల విభజనను డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఇందులో సీఈసీ జ్ఞానేశ్ ఉన్నారు. అంటే బీజేపీకి అనుకూలంగా ఆయన విభజిస్తారేమో అనే ఆరోపణలు వస్తున్నాయి. పునర్విభజన తర్వాత రెండు సభల బలాల్లో అంతరం 543-250 నుంచి 816-250కు పెరగనుంది. ఉమ్మడి సమావేశం జరిగినా రాజ్యసభ సాపేక్ష బలం గణనీయంగా తగ్గిపోతుంది. ఇది రాష్ర్టాలకు, రెండో సభ అందించాల్సిన విస్తృత చర్చల భావనకు నష్టం చేస్తుందన్న విమర్శ ఉంది. ఇక ఎలక్టోరల్ బాండ్లు ఉన్నా లేకున్నా, బీజేపీ ప్రకటించిన నిధులు అన్ని పార్టీలు కలిపినా ఎక్కువే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

