ఓ వారసుడి జీవన ప్రయాణం
విశ్వక్సేన్ కథానాయకుడిగా రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’. సాయికిరణ్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో యశ్వంత్ దగ్గుమాటితో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ శనివారం మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారం, ఆశయం, కుటుంబ బంధాలు, ప్రేమ, ద్రోహం వంటి బలమైన అంశాల చుట్టూ ఈ సినిమా సాగుతుందని, తండ్రి రాజకీయ వారసత్వం కారణంగా అనూహ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సివచ్చిన ఓ వారసుడి జీవన ప్రయాణమే ఈ సినిమా అని, రాజకీయాలు వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఈ సినిమాలో చూపించడం జరిగిందని మేకర్స్ తెలిపారు. మునుపెన్నడూ చూడని ఓ పవర్ఫుల్ రోల్లో విశ్వక్సేన్ నటించనున్న ఈ సినిమాలో కేకే మీనన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఏక్తా రాథోడ్ కథానాయిక. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: జిజు సన్నీ, సంగీతం: గోవింద్ వసంత.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

