రోడ్డెక్కిన విద్యార్థులు
- పురుగుల అన్నం.. కుళ్లిన కూరగాయలు
- నాణ్యతలేని భోజనంపై మండిపాటు
దుండిగల్:కుళ్లిన కూరగాయలు, నీళ్ల చారుతో పురుగుల అన్నం వడ్డిస్తూ.. తమ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని బాచుపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగుయూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సమస్యను పరిష్కరించాలంటూ అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.అధికారుల తీరుకు వ్యతిరేకంగా పలువురు విద్యార్థులు శనివారం వర్సిటీ ప్రధా నగేటు ముందు కొద్దిసేపు బైఠాయించి ఆందోళన చేపట్టారు. వర్సిటీ వీసీ వచ్చి తక్షణమే తమస్యను పరిష్కరించాలని నినదించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ నాణ్యతలేని భోజనం తింటుండటంతో తమ ఆరోగ్యం దెబ్బతింటున్నదన్నారు.
పురుగులు పట్టిన బియ్యంతో అన్నం వండటంతో పాటు నీళ్లచారు, ళ్లిన కూరగాయలతో తయారు చేసిన కూరలను వడ్డిస్తున్నారని ఆరోపించారు. వర్సిటీ వీసీ స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రార్ కోట్ల హన్మంతరావు, చీఫ్ వార్డెన్ విజయ్ విద్యార్థులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు తమ ఆందోళన విరమించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

