పూల ఐస్ ఫ్రూట్
మీకు పాల ఐస్ తెలుసు... పూల ఐస్ తెలుసా? ఐస్‌ఫ్రూట్ తినే ఉంటారు...ఫ్రూట్ ఐస్ గురించి విన్నారా?... అయితే మండే ఎండల్లో ఈ చల్లచల్లటి సంగతులు తెలుసుకోవలసిందే.
మీకు పాల ఐస్ తెలుసు… పూల ఐస్ తెలుసా? ఐస్‌ఫ్రూట్ తినే ఉంటారు…ఫ్రూట్ ఐస్ గురించి విన్నారా?… అయితే మండే ఎండల్లో ఈ చల్లచల్లటి సంగతులు తెలుసుకోవలసిందే. ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మామిడి పండును పోలిన ఐస్క్రీమ్లాగే రకరకాల ఫలాలను పోలిన హిమక్రీములు, పూలని పోలిన మంచు మిఠాయిల్ని కూడా తయారు చేస్తున్నారు. చూస్తే హాయిగా, తింటే చల్లగా ఉండే వీటి విశేషాలు మీ కోసం…
కొందరికి ఐస్‌క్రీమ్ ఎప్పుడూ ఫేవరెట్టే. కానీ అది అందరికీ నచ్చేది మాత్రం ఎండాకాలంలోనే. ఎండల్లో హాయ్ హాయ్‌గా అనిపించాలంటే వెన్నెలలాంటి వెనీలానో, రాత్రిలాంటి డార్క్ చాక్లెట్టో పొట్టలో పడాల్సిందే! ఒకప్పుడు మనకు తెలిసింది పుల్ల ఐసూ, పాల ఐసే అయినా… ఇప్పుడు విందు భోజనంలోని వంటల
రకాలన్నీ వీటిలోనూ వచ్చేస్తున్నాయి.
అచ్చంగా పండ్ల రుచిని తలపించేలా రియల్ ఫ్రూట్ ఐస్‌క్రీమ్‌లూ చవులూరిస్తున్నాయి. సీజన్‌ని బట్టి పండ్లు మారినట్టే, ఎప్పటికప్పుడు ఐస్‌క్రీమ్ వెరైటీలూ మారుతున్నాయి. కొత్త రుచులు మాత్రమే కాదు, కొత్త ఆకృతుల్లోనూ ఇప్పుడివి ఆకట్టుకుంటున్నాయి. చాలా మంది ఇష్టంగా తినే మక్కజొన్న కంకిలా కనిపించే వాటితో పాటు రకరకాల పువ్వులు, పండ్ల రూపాల్లో రూపుదిద్దుకుంటున్నాయి.

రూపాలెన్నో…
తియ్యటివి, పుల్లటివి, కమ్మటివి… ఇలా పండ్లు ఎన్నో రుచుల్లో కాస్తుంటాయి. ఒక్కొక్కరూ ఒక్కో రకం పండును ఆస్వాదిస్తారు. అచ్చం అలాగే, ఎవరి అభిరుచికి తగ్గట్టు వారు ఎంచుకునేలా వివిధ ఫలాలను పోలి, అదే రుచి కలిగిన ఐస్‌క్రీమ్‌లను తయారు చేస్తున్నాయి కంపెనీలు. ఈ పండ్ల ఆకృతిలో ఉండే ఐస్‌క్రీమ్‌లకు వైట్ చాక్లెట్ పైన పొరలా ఉంటుంది. దాని మీద ఆయా ఫలాలకు సంబంధించిన రంగులు వేస్తారు. అరటి, మామిడి, యాపిల్, బెర్రీలు.. ఇలా విభిన్న రకాల పండ్లను పోలి ఉండే వాటితో పాటు, తరిగిన పండ్ల ముక్కల ఆకృతుల్లోనూ ఈ ఫ్రూట్ ఐస్‌లను తీసుకొస్తున్నారు.
ఇవే ఈ ఏడాది సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, అసలు పండు కన్నా, ఈ ఐస్‌క్రీమ్ మరింత రుచిగా ఉందంటూ వీటిని తిన్నవాళ్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. కలువ, సకుర, గులాబీ తదితర పూలను పోలిన ఐస్‌క్రీమ్‌లూ కొత్త కొత్తగా పలకరిస్తున్నాయి. ఐస్‌క్రీమ్ ప్రియుల హృదయాన్ని దోచేస్తున్నాయి. మనసుకు నచ్చిన పువ్వును, జిహ్వ మెచ్చిన పండును మంచు మిఠాయిలా రుచి చూసే అవకాశం వస్తే ఎవరు మాత్రం వదిలి పెడతారు చెప్పండి!

Peach Ice Cream


Ice3
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

