ప్రస్తుత నిత్యావసరాల్లో ఒకటి స్మార్ట్‌ఫోన్. చేతిలో స్మార్ట్‌ఫోన్ లేనిదే ఏ పనీ జరగడం లేదు. ఓ అధ్యయనం ప్రకారం సగటున ఒక వ్యక్తి రోజుకు 2,617 సార్లు ఫోన్ తాకుతున్నాడట. అంటే ప్రతీ 3 నిమిషాలకు ఓసారి ఫోన్ చూస్తున్నాడన్నమాట! పెరిగిన స్క్రీన్ టైమ్ కారణంగా కంటిచూపుతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తున్నది. అయితే చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ స్మార్ట్ వ్యసనాన్ని ఇస్మార్ట్‌గా దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.