Viral news | స్టేజ్‌పై విద్యార్థి కాలర్ పట్టుకున్న ప్రొఫెసర్.. తప్పెవరిదనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ..!
Viral news | గుజరాత్ (Gujarat) లోని నిర్మా యూనివర్సిటీ (Nirma University) లో చోటుచేసుకున్న ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. కాలేజీలో జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో భాగంగా కామెడీ షో జరగుతుండగా ఓ విద్యార్థి సరదా కామెంట్స్ చేశాడు. దాంతో ఆగ్రహించిన ప్రొఫెసర్ ఆ విద్యార్థిని స్టేజీపైకి పిలిచి కాలర్ పట్టుకుని హెచ్చరించాడు.
Viral news : గుజరాత్ (Gujarat) లోని నిర్మా యూనివర్సిటీ (Nirma University) లో చోటుచేసుకున్న ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. కాలేజీలో జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో భాగంగా కామెడీ షో జరగుతుండగా ఓ విద్యార్థి సరదా కామెంట్స్ చేశాడు. దాంతో ఆగ్రహించిన ప్రొఫెసర్ ఆ విద్యార్థిని స్టేజీపైకి పిలిచి కాలర్ పట్టుకుని హెచ్చరించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్ల (Netizens) నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. నిర్మా యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు ‘టెక్నోఫోరా 2026’ కార్యక్రమం జరిగింది. టెక్ పోటీలు, వర్క్‌షాప్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన ఈ వేడుకల్లో 800 మందికిపైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్టాండప్ కామెడీ షో జరుగుతున్న సమయంలో ఓ విద్యార్థి ‘జల్దీ బోల్.. కల్ సుబహ్ పన్వేల్ నికల్నా హై’ అంటూ సరదా కామెంట్స్ చేశాడు. దాంతో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ హిమాన్షు కే పటేల్ ఆ విద్యార్థిని స్టేజ్‌పైకి పిలిచి.. అతడి కాలర్ పట్టుకుని వార్నింగ్ ఇచ్చాడు.
వైరల్ అవుతున్న ఈ వీడియోపై ప్రొఫెసర్ స్పందించాడు. విద్యార్థి తనతో అలా మాట్లాడటంపై ఆగ్రహం వచ్చిందన్నారు. తల్లిదండ్రులతో కూడా ఇలాగే మాట్లాడతావా..? అని ప్రశ్నించానని చెప్పారు. విద్యార్థి తన తప్పును అర్థం చేసుకొని క్షమాపణ చెప్పాడని తెలిపారు. తర్వాత విద్యార్థులు తన కాళ్లకు నమస్కరించారని, తాను కూడా తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడి క్షమాపణ చెప్పానని వివరించారు. అక్కడితో ఈ విషయం ముగిసిందని తెలిపారు. అయితే ఈ వీడియోపై కొందరు ప్రొఫెసర్ తీరును తప్పుబడుతున్నారు. మరికొందరు విద్యార్థి చేసిన వ్యాఖ్య సరికాదని అంటున్నారు. ఈ వ్యవహారంపై నిర్మా యూనివర్సిటీ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
Farmers | పంటలు ఎండిపోతున్నా పట్టింపు లేదా.. అన్నదాతల ఆగ్రహం
Gang Rape | మహిళపైనా ‘గ్యాంగ్ రేప్’ కేసు పెట్టొచ్చు.. ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

