Leopard | శంషాబాద్ రూరల్: శంషాబాద్ ఎయిర్పోర్టులో చిరుత సంచారం కలకలం రేపింది. విమానాశ్రయం ప్రహరీ లోపలి భాగంలో ఆదివారం తెల్లవారుజామున చిరుత కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అప్రమత్తమైన ఎయిర్పోర్టు, అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చేపట్టారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలతో పాటు ఎయిర్పోర్టు సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని ఆర్జీఐఏ పోలీసులు సూచించారు. చిరుతను పట్టుకునేందుకు రెండు బోన్లను ఏర్పాటు చేశారు.