ఆమె అంతరంగపు
భావాల మువ్వల సవ్వడి
నిశ్శబ్దపు సమాధయ్యింది
కలలు ఆశలు ఆటలు
అందులోనే దాచుకున్నాయి
ఆలోచనలు ఆదర్శాలు
అందులోనే
దోబూచులాడుతున్నాయి
ఆమె ఆధునికతపు
ఉద్వేగాల గాజుల
సందడి సాంప్రదాయ
నిశీధిలో నిర్జీవమయ్యింది
చుట్టూ హద్దులు
అలుముకున్నాయి
గుండె సంద్రంలో కన్నీటి
వర్షాన్ని ఆశ్రయిస్తున్నాయి
అంతరిక్ష శోధనలో
ఆమె రాకెట్లా దూసుకెళ్తుంది
చిరునవ్వు దరహాసంలో
ఆమె చుట్టూ ఎవ్వరికీ కనిపించని
అనంత శూన్యం
ఆవరించి ఉంది
కేరింగ్ లేని ఈ సమాజంలో
ట్రోలింగ్‌తో నిత్య
యుద్ధం చేస్తుంది
ఆమెకు ఎన్ని సమస్యలున్నా
‘అతడే’ ఆమెకు సమస్య అయినా
ఎందుకో ఆమె అడుగు
ఆపడం లేదు
స్వేచ్ఛగా ధైర్యంతో
ముందడుగే వేస్తుంది
(ఆడవారిపై జరిగే
ట్రోలింగ్‌కు వ్యతిరేకంగా..)
– ఫిజిక్స్
అరుణ్‌కుమార్
95947 49536