Telangana | పార్లమెంట్ ఎన్నికలు.. రాష్ట్రంలో పట్టుబడ్డ 104 కోట్ల నగదు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్ 28 వరకు రూ.104.18 కోట్లను తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.
- 7,174 లైసెన్స్డ్ ఆయుధాలు డిపాజిట్
Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్ 28 వరకు రూ.104.18 కోట్లను తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 477 ఎఫ్ఎస్టీ, 464 ఎస్ఎస్టీ బృందాలు 89 సరిహద్దు చెక్‌పోస్టుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టి అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, డ్రగ్స్, ఉచితాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ తనిఖీల్లో రూ.63.18 కోట్ల నగదు ఇప్పటికే దొరకడం కలకలం సృష్టిస్తున్నది. ఇక రూ.5.38 కోట్ల విలువైన మద్యం, రూ.7.12 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.21.34 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.6.91 కోట్ల విలువైన ఇతర వస్తువులును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7,174 లైసెన్స్డ్ ఆయుధాలను పోలీసులకు డిపాజిట్ చేశారు. అనధికారికంగా వెంటపెట్టుకొన్న 14 ఆయుధాలను సీజ్ చేశారు. జిలిటెన్‌స్టిక్స్, డిటోనేటర్లు, కార్టన్ బాక్స్ వంటి పలు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యువత డ్యాన్స్ ప్రతిభకు సువర్ణావకాశం’
Diwali Special | దీపావళి స్పెషల్.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
AP Election Results | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు ఫలితాల్లో కొనసాగుతున్న కూటమి హవా
‘మురుసు తుఫాన్ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి’
Manne Krishank | రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డికి మెమొరీ లాస్.. అందుకే ఇన్‌కం ట్యాక్స్ కట్టలేదట: మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

