Sonam Kapoor | సెలెబ్రిటీలకు అందం ముఖ్యం. అందం ఉన్నంత కాలమే అవకాశాలు క్యూ కడతాయి. వయసుతోపాటు పెండ్లి, పిల్లలు.. అందాన్ని ప్రభావితం చేస్తాయి. అందరిలాగే తనకూ అవి అవరోధాలుగా నిలిచాయని చెబుతున్నది బాలీవుడ్ నటి సోనమ్ కపూర్. స్టార్ డాటర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ సినిమాలు, పెండ్లి విషయంలో అనేక ట్రోల్స్‌కు గురైంది సోనమ్.
‘తల్లి అయ్యాక నా శరీరంలో వచ్చిన మార్పులు, అధిక బరువు కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. నాతో నేను గడిపే సమయం తగ్గిపోయింది. శారీరం గురించి ఆలోచించే తీరికే లేకుండా పోయింది. కానీ, అమ్మతనం కన్నా అందమేముంది చెప్పండి? అయితే బాబు పుట్టిన తర్వాత ఏకంగా 32 కిలోల బరువు పెరిగాను. దాన్ని గుర్తించడానికి నాకు ఏడాదిన్నర పట్టింది. పెరిగిన బరువు తగ్గించుకోవాలని సంకల్పించాను. కష్టతరమైన వ్యాయామాలు చేస్తున్నా. ఆహారపు అలవాట్లు మార్చుకున్నా. త్వరలోనే మునుపటి సోనమ్‌ను చూస్తార’ని చెబుతున్నది ఈ బ్యూటీ.