చైనాకు చెందిన ఇన్ఫినిక్స్ సంస్థ.. నోట్ 40ప్రో సిరీస్‌లో రెండు కొత్తఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ, ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్ 5జీ పేర్లతో వస్తున్న ఈ స్మార్ట్ఫోన్లలో మీడియా టెక్ డైమెన్ సిటీ 70206 ఎన్ఎం ప్రాసెసర్‌ను అమర్చారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీని అందిస్తున్నారు. ఇందులోని 108 మెయిన్ కెమెరాతో.. ప్రొఫెషనల్ కెమెరాలను తలపించేలా ఫొటోలు తీసుకోవచ్చు. 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే.. కళ్లపై ఏమాత్రం ఒత్తిడిని పడనీయదు. ఇందులోని 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో.. రివర్స్ చార్జింగ్ టెక్నాలజీ ద్వారా ఇతర ఫోన్లనూ చార్జ్ చేసుకోవచ్చు. 40 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేసే ప్రో మోడల్ ధర రూ.21,999. 100 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేసే ప్రో ప్లస్ మోడల్ ధర రూ.24,999. infinixmobility.com తోపాటు అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తుంది.
చిన్నపాటి అనారోగ్యంతో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లినా.. ‘వంటల్లో నూనె తగ్గించండి!’ అనే సలహా ఇస్తాడు. కానీ, ఇష్టమైన వంటకాల్లో కొంచెం నూనె తగ్గినా.. ‘టేస్ట్ లేదు!’ అంటూ పక్కన పెట్టేస్తుంటారు చాలామంది. మరి పూర్తిగా నూనె లేకుండా వంట చేస్తే తినగలరా? అలాంటి వారికోసమే ఓ సరికొత్త ఓవెన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రముఖ గృహోపకరణాల సంస్థ ఉషా. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ‘ఐచెఫ్ స్టీమ్ ఓవెన్’.. చుక్క నూనె లేకుండా వంట చేసిపెట్టేస్తుంది. 18 లీటర్ల కెపాసిటీతో వస్తున్న ఈ ఓవెన్.. స్టీమర్, ఎయిర్ ఫ్రయర్గానూ పనిచేస్తుంది. ఇందులోని 11 కుకింగ్ ఫంక్షన్స్.. మీకు నచ్చిన వంటను నిమిషాల్లో వండి వారుస్తాయి. ఇందులో మరో ప్రత్యేకత.. 3డీ హాట్ స్టీమ్ టెక్నాలజీ. ఇది ఆహార పదార్థాల్లోని పోషకాలను కోల్పోకుండా కాపాడుతుంది. సెల్ఫ్ క్లీనింగ్ ఫంక్షన్, కీప్ వార్మ్ ఫంక్షన్‌తోపాటు డిజిటల్ టచ్ ప్యానెల్, సేఫ్టీ డోర్ సెన్సర్లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. రెండేండ్ల వారంటీతో వస్తున్న ఈ ఓవెన్ ఖరీదు రూ. 30,990. ushacook.comతోపాటు అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
ప్రకృతి ప్రేమికులు మాటలు, చేతల్లోనే కాదు.. ఆహార్యంలోనూ ప్రకృతిపై ప్రేమను తెలియజేస్తుంటారు. ఇంకొందరైతే.. ఆ ఇష్టాన్ని నగల్లోనూ చూపించాలని అనుకుంటారు. అలాంటి ప్రకృతి ప్రేమికుల కోసం లండన్‌కు చెందిన ప్రముఖ డిజైనర్ అనిస్సా కెర్మిచ్ సరికొత్త గాజులను డిజైన్ చేశారు. ‘ఆకు’ను ప్రధానంగా చేసుకొని, చేతికి అల్లుకున్న తీగలా రూపొందిన ఈ ‘ఫ్లో-రల్’ గాజు.. ప్రకృతి సంరక్షణ మన చేతుల్లోనే ఉన్నదన్న నిజాన్ని గుర్తుచేస్తుంది. బంగారుపూతతో మెరిసిపోయే ఈ ఇత్తడి బ్యాంగిల్ ధర రూ. 40,500. net-a-porter.com ద్వారా ఆర్డర్ చేయవచ్చు.
ప్రయాణాలు చేసేవారికి ఎదురయ్యే ప్రధాన సమస్య.. సెల్‌ఫోన్ చార్జింగ్. అయితే, పవర్ బ్యాంక్స్ ఉన్నప్పటికీ.. ఎక్కువ బరువు ఉండటం వీటికి ప్రతికూలంగా మారుతుంది. అందుకే, ర్యాప్స్ సంస్థ.. ఫ్యూయెల్ బడ్డీ 10X పేరుతో తేలికైన పవర్ బ్యాంక్‌ను తయారుచేసింది. 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ పరికరం.. కేవలం 0.7 అంగుళాల మందం, 500 గ్రాముల కంటే తక్కువ బరువు ఉంటుంది. ఈతరం ప్రయాణీకులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ ఫ్యూయెల్ బడ్డీ ఒక్క స్మార్ట్ఫోన్లనే కాదు.. ట్యాబ్లెట్స్, స్మార్ట్‌వాచీలను కూడా నిమిషాల్లో చార్జ్ చేసేస్తుంది. ఇందులోని డిజిటల్ డిస్ప్లే.. బ్యాటరీ స్థితి, చార్జింగ్ పవర్, మిగిలిన చార్జింగ్ సమయాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. రెండు ఇన్పుట్, నాలుగు అవుట్లెట్ పోర్టులతో ఏకకాలంలో నాలుగు పరికరాల వరకూ చార్జ్ చేసుకునే వీలుకల్పించే ఈ పవర్‌బ్యాంక్ ధర. రూ.699. అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ దొరుకుతుంది.