Vastu Shastra | ఇంటి లోపల వాయవ్యంలో టాయిలెట్ ఉంటే..
కొన్ని ఇండ్లల్లో ఎక్కువగా అనారోగ్యాలపాలు కావడం.. మరికొన్ని ఇండ్లల్లో ఎక్కువగా అకాల మరణాలు సంభవించడం.. ఇంకొన్ని ఇండ్లల్లో ఎక్కువగా పోలీసు కేసులు నమోదుకావడం.. ఇలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇంటితోపాటు ఇంట్లోని వ్యక్తుల గురించి కూడా ఆలోచించాలి.
Vastu Shastra | మా కుటుంబంలో చాలామంది రోడ్డు ప్రమాదాల్లోనే చనిపోయారు. అందుకు ఇంట్లో లోపాలే కారణమా? ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉంటాయా?
– మోనిక, శెనిగచెర్ల.
కొన్ని ఇండ్లల్లో ఎక్కువగా అనారోగ్యాలపాలు కావడం.. మరికొన్ని ఇండ్లల్లో ఎక్కువగా అకాల మరణాలు సంభవించడం.. ఇంకొన్ని ఇండ్లల్లో ఎక్కువగా పోలీసు కేసులు నమోదుకావడం.. ఇలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇంటితోపాటు ఇంట్లోని వ్యక్తుల గురించి కూడా ఆలోచించాలి. జీవ లక్షణాలు ఎన్నో కదా! రోడ్డు ప్రమాదాలు అధికంగా అవుతున్నాయి అంటే.. ఆయా వ్యక్తులు దూకుడు స్వభావం కలిగినవాళ్లు కూడా కావచ్చు. అయినదానికీ, కానిదానికీ వేగంగా డ్రైవింగ్ చేసే స్వభావం, స్పీడును ఇష్టపడటం కూడా ఉంటుంది. మాట వినని, లెక్కచేయని తత్వం ఉంటుంది.
మనిషి తన స్వభావాన్ని పసిగట్టకుండా, దాని ప్రేరేపణతో అలాంటి వాటిని ప్రోత్సహించే అవలక్షణాలు ఉన్న పరిసరాల ఇంట్లో ఉంటాడు. అలాంటి వాటికి దోహదపడే ఇంటిని ఎంపిక చేసుకుంటాడు. స్నేహితులు కూడా అలాగే దొరుకుతారు. రైడింగ్ బ్యాచ్ కాబట్టి.. వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవడంతోపాటు ఇంటికి నైరుతి వీధిపోటు ఉన్నా.. దక్షిణం – పడమరలు పెరిగినా.. ఈశాన్యం తెంపు కలిగి, దక్షిణంలో బావి, సెప్టిక్ ట్యాంక్ లాంటివి ఉన్నా.. అలాంటి ప్రమాదాలు సంభవిస్తుంటాయి. జాగ్రత్తగా చూసుకొని, అవసరం అయితే, ఇల్లు మారండి.

ఇంటి లోపల వాయవ్యంలో టాయిలెట్ ఉంటే.. ఆ మూల మూతపడ్డట్టు కాదా? అయితే, టాయిలెట్ ఏ స్థానంలో ఉండాలి?
– కె. రామచంద్ర, ఆమనగల్లు.
ఇంటిలో మూలవేరు.. ఇంటి కాంపౌండు లోపలి ఆవరణం వేరు. కాంపౌండు లోపల ఎక్కడ ఉపగదులు కట్టినా.. విదిక్కులు మూసుకుపోయేలా నిర్మించకూడదు. మూలలు ముక్కుల వంటివి. అవి ఖాళీగా ఉంచి, మనం వెళ్లగలిగే అవకాశం ఉండాలి. ఆ చోటుల్లో టాయిలెట్లు నిర్మించడం మంచిదికాదు. తద్వారా గృహసభ్యుల ఆరోగ్య విషయం దెబ్బతింటుంది. ఒక్కో మూల ఒక్కో గుణవిశేషం కలిగి ఉంటుంది. ఇంట్లో హాలు వేరు.. పడక గదిలో మూలలు వేరు.
ఒక పడక గదిలో.. అంటే, శాస్త్రం సూచించిన పడకగదిలో వాయవ్యం లేదా ఆగ్నేయంలోనే టాయిలెట్ నిర్మించాలి. అందులో కూడా నైరుతి మూల ఈశాన్యం మూల పనికిరావు. అలాంటప్పుడు అది సవ్య స్థలమే అవుతుంది. మూతపడటం కాదు. అవి ఉండే స్థానాలు.. అవే! అయితే, ఈశాన్యంలో పడకగది కట్టి, అందులో వాయవ్యం లేదా ఆగ్నేయంలో టాయిలెట్ కడతాను అనుకోవద్దు. అసలు ఈశాన్యం దిశలో పడక గదినే నిషేధించారు శాస్త్రజ్ఞులు. కాబట్టి, ఏదైనా తెలిస్తే ఆచరించాలి. లేదా తెలుసుకొని నిర్మించాలి.
మా స్థలంలో అన్నీ పెద్దపెద్ద రాళ్లు ఉన్నాయి. దక్షిణం ఎత్తుగానే ఉంది. ఆ రాళ్లను అలాగే ఉంచి.. ఇల్లు కట్టొచ్చా?
– కె. స్రవంతి, రామాంతపూర్.
రాళ్లు – గుట్టలు ఇంటి స్థలంలో ఉంటే.. అవి దక్షిణ – నైరుతి ఎత్తుగా, పడమర ఎత్తు ఉండి.. ఉత్తరం దిక్కు లేదా తూర్పు దిక్కు వాలుగా ఉంటే.. ఇంకేముంది ‘వాస్తుకు చాలా అనుకూలంగా ఉంది’ కదా అని, అలాంటి గుట్టల స్థలం ఎంచుకుంటున్నారు కొందరు. అది చాలా తప్పు. ఏవో కొన్ని లక్షణాలు అనుకూలంగా ఉన్నాయని వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. ‘స్థలం’ ఆహారం లాంటిది. తినగలిగే యోగ్యత దానికి, దానిని అరిగించుకునే యోగ్యత మనకూ ఉండాలి. భూమిలో ఏవి.. ఎంతపాలు ఉన్నాయి? దాని లక్షణాలు ఏంటి? అక్కడ ఎలాంటి మొక్కలు ఉన్నాయి? అక్కడి నీటిశాతం ఎంత? మట్టిశాతం ఎంత?
అది సారవంతమైనదేనా?.. ఇలాంటి విషయాలు చూడకుండా నిర్ణయాలు తీసుకోవద్దు. కేవలం బొద్దుగా, ముద్దుగా ఉండగానే జీవిత భాగస్వామి కాలేడు. ఎన్నో చూడాలి. ఎన్నో పరిశీలించాలి కదా! రాళ్లతో నిండిన స్థలంలో ఇల్లు కడితే.. ఆ ఇల్లు కూడా చివరికి రాళ్లపాలే అవుతుంది. అది జీవరహితమై, మనం చిరకాలం అందులో ఉండలేకపోతాం. కన్ను చూసింది.. అన్నీ కావాలనుకుంటే అది ఆ క్షణమే! కానీ, మనోగతమైన ప్రశాంతత, ఆరోగ్యం తదితర అంశాలకు అనుకూల స్థలం ఎంచుకోవాలి. గృహానికి స్థలమే మూలం! గుర్తుంచుకోండి.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

