Ishaq Dar | ఇస్లామాబాద్: పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ (73) ఆదివారం ఆ దేశ ఉప ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. ఆయన ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్ -ఎన్‌కు చెందిన నేత. ఆయనను షరీఫ్ ఉప ప్రధానిగా నియమించినట్లు కేబినెట్ డివిజన్ విడుదల చేసిన నోటిఫికేషన్ తెలిపింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని, తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు కొనసాగుతాయని వివరించింది.
షరీఫ్, దార్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. ప్రధాని షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్ కుమార్తెను దార్ కుమారునికి ఇచ్చి వివాహం చేశారు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఉంది. ఆర్థిక మంత్రిగా దార్‌కు ఆయన పార్టీలో మంచి పేరు ఉంది. అయినప్పటికీ షెహబాజ్ షరీఫ్ ఈసారి ఆయనకు విదేశాంగ శాఖను అప్పగించడం అందరినీ ఆశ్చర్యపరచింది.