ఈ సీజన్లో ముందు బ్యాటింగ్ చేస్తూ భారీ స్కోర్లు నమోదుచేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఛేదనలో మాత్రం వరుసగా రెండోసారి చేతులెత్తేసింది. ఉప్పల్‌లో బెంగళూరుతో ఆడిన గత మ్యాచ్ మాదిరిగానే చెపాక్ (చెన్నై) లోనూ తడబడింది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సమిష్టి ప్రదర్శనతో ఎస్ఆర్హెచ్పై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. చెన్నై నిర్దేశించిన 213 పరుగుల లక్ష్య ఛేదనలో 134 పరుగులకే ఆలౌట్ అయింది.
SRH | చెన్నై: ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ చేతులెత్తేసింది. ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ముగిసిన పోరులో భాగంగా 213 పరుగులను ఛేదించే క్రమంలో ఎస్ఆర్హెచ్.. 134 పరుగులకే కుప్పకూలి 78 పరుగుల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (54 బంతుల్లో 98, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. డారిల్ మిచెల్ (32 బంతుల్లో 52, 7 ఫోర్లు, 1 ఇన్నింగ్స్) రాణించాడు. అనంతరం ఛేదనకు దిగిన హైదరాబాద్.. 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది. మార్క్మ్ (26 బంతుల్లో 32, 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా టాపార్డర్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. సీఎస్కే బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే (4/27), మతీశ పతిరాన (2/17) హైదరాబాద్‌ను కట్టడి చేశారు. గైక్వాడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
చెన్నై బ్యాటింగ్‌లో గైక్వాడ్ ఇన్నింగ్సే హైలైట్. రహానే నిరాశపరిచినా వన్ డౌన్లో వచ్చిన డారిల్ మిచెల్‌తో కలిసి సీఎస్కే స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. రెండో వికెట్‌కు 107 పరుగులు జతచేసిన ఈ జోడీని 14వ ఓవర్లో ఉనద్కత్ విడదీశాడు. చివరి ఓవర్లలో దూబే (20 బంతుల్లో 39 నాటౌట్, 1 ఫోర్, 4 సిక్సర్లు)తో కలిసి చెన్నై సారథి దూకుడుగా ఆడటంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది.
భారీ ఛేదనలో రైజర్స్ మరోసారి తేలిపోయింది. ట్రావిస్ హెడ్ (13), అభిషేక్ శర్మ (15)ను పెవిలియన్‌కు పంపిన తుషార్ ఎస్ఆర్హెచ్ను ఆదిలోనే దెబ్బతీశాడు. నితీశ్ (15) నిరాశపరిచాడు. మార్క్మ్‌న్రు పతిరాన పదో ఓవర్లో ఐదో బంతికి క్లీన్‌బౌల్డ్ చేసి రైజర్స్‌ను కోలుకోనీయలేదు. హైదరాబాద్ భారీ ఆశలు పెట్టుకున్న హెన్రిచ్ క్లాసెన్ (20) కూడా పతిరాన బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. అబ్దుల్ సమద్ (19)ను శార్దూల్ ఔట్ చేయడంతో చెన్నై విజయం ఖరారైంది.
చెన్నై: 20 ఓవర్లలో 212/3 (రుతురాజ్ 98, మిచెల్ 52, భువనేశ్వర్ 1/38, ఉనద్కత్ 1/38).
హైదరాబాద్: 18.5 ఓవర్లలో 134 (మార్క్మ్ 32, క్లాసెన్ 20, తుషార్ 4/27, పతిరాన 2/17)