Mrunal Thakur | ‘కథకు న్యాయం చేయడం నటీనటుల బాధ్యత. కథ అడిగింది మేం చేయాలి. ‘నేను చేయను’ అంటూ భీష్మించుకుని కూర్చుంటే ఇక్కడ ఎదగలేం.’ అంటున్నది అందాలభామ మృణాళ్ఠాకూర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ముద్దు సన్నివేశాలపై ఆసక్తికరంగా మాట్లాడింది మృణాళ్.
‘కెరీర్ తొలినాళ్లలో ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఈ కారణంతో చాలా సినిమాలను కోల్పోయాను. ఆ తర్వాత నేనే వాళ్లను ఒప్పించాను. దర్శకుడు యాక్షన్ చెప్పగానే మేం పాత్రగా మారిపోవాలి. అప్పుడు నేను మృణాళ్ని కాను. ఈ విషయం అమ్మానాన్నలకు అర్థం కావడానికి కాస్త సమయం పట్టింది’ అంటూ చెప్పుకొచ్చింది మృణాళ్ ఠాకూర్.