RRR | ఆర్ఆర్ఆర్ (RRR)తో తెలుగు సినిమా స్థాయిని మరోసారి గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర చాటిచెప్పాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్… తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్-2023కి నామినేట్ అయింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకుడు విభాగాల్లో ఈ చిత్రం నామినేట్ అయింది.
ఆర్ఆర్ఆర్ రెండు విభాగాల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్-2023కి ఎంపికవడంపట్ల దర్శకధీరుడు రాజమౌళి, నటుడు జూనియర్ ఎన్టీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు గాను చిత్ర యూనిట్‌కు, అభిమానులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Delighted that #RRRMovie has been nominated in two categories at the Golden Globe Awards!
Congratulations to all of us… Looking forward.
— Jr NTR (@tarak9999) December 12, 2022
కాగా, ఈ చిత్రం ఇప్పటికే ‘లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ బెస్ట్ మ్యూజిక్ కేటగిరీలో ఎంఎం కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. అలాగే బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్లో కూడా కీరవాణి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విన్నర్‌గా అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే.
Thanks to the jury at @goldenglobes for nominating #RRRMovie in two categories. Congratulations to the entire team…
Thanks to all the fans and audience for your unconditional love and support through out. 🤗🤗🤗
— rajamouli ss (@ssrajamouli) December 12, 2022
ఈ ఎపిక్ డ్రామా చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ (Ram Charan) నటించగా.. ఎన్టీఆర్ (Jr NTR) కొమ్రంభీం పాత్రలో నటించాడు.అలియాభట్, అజయ్ దేవ్గన్, శ్రియాశరణ్, ఒలివియా మొర్రీస్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా కలెక్షన్లు వసూళ్లు చేసింది.
Best Music/Score, Winner: M.M. Keeravani, RRR #LAFCA
— Los Angeles Film Critics Association (@LAFilmCritics) December 11, 2022