Mrunal Thakur | టాలీవుడ్‌తో పాటు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ నోట విన్నా ఎక్కువగా వినిపిస్తున్న పేరు మృణాళ్ ఠాకూర్ (MrunalThakur). లవ్ సోనియా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ భామ సీతారామం సినిమాతో తెలుగుతోపాటు ఇండియావైడ్‌గా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. 2023లో నానితో కలిసి హాయ్ నాన్న సినిమాలో నటించి సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. అయితే రీసెంట్గా ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్లో మృణాళ్ ఠాకూర్ తన అందంతో అందరిని కట్టిపడేసింది. రెడ్ కలర్ లెహంగా డ్రెస్‌లో ఫ్యాషన్ ఈవెంట్లో మృణాళ్ ఠాకూర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇక మృణాళ్ వేసుకున్న ఈ స్టైలిష్ అవుట్‌ఫిట్ రూపొందించేందుకు డిజైనర్‌కు 1400 గంటల సమయం పట్టిందని తెలిపింది.
Mrunal Thakur ✨🔥 #MrunalThakur pic.twitter.com/nLMerF01rI
— Siva Harsha (@SivaHarsha_23) May 3, 2024