మహబూబ్నగర్ : త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్( Graduate ) ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్నగర్లో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud
) ,తన కూతుర్లు శ్రీహిత, శ్రీహర్షితతో కలిసి ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
2023 కంటే ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. గత ఎన్నికల్లో ఓటు వేశాం కాబట్టి ఇప్పుడు మళ్లీ నమోదు అవసరం లేదని భావించవద్దని సూచించారు.
ఎన్నికలు జరుగనున్న ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లోని అర్హులైన పట్టభద్రులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి ఓటరు నమోదును చేసుకోవాలని కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియలో పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో యువతకు సహకరించాలని మాజీ మంత్రి విన్నవించారు.