Mamitha Baiju | ప్రేమలు హీరోయిన్ అసలు పేరు మమిత కాదట.. వాళ్ల ఒక్క పొరపాటుతో జాతకమే మారిపోయింది!
Mamitha Baiju | టాలీవుడ్లో ఇప్పుడు మమితా బైజు ఒక సంచలనం. తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకపోయినా ఇక్కడి ఆడియన్స్ క్రష్‌గా మారిపోయింది. ప్రేమలు అనే మలయాళం డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది
Mamitha Baiju | టాలీవుడ్లో ఇప్పుడు మమితా బైజు ఒక సంచలనం. తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకపోయినా ఇక్కడి ఆడియన్స్ క్రష్‌గా మారిపోయింది. ప్రేమలు అనే మలయాళం డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ సినిమాలో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్న మమితకు ఇప్పుడు టాలీవుడ్‌లోనూ ఆఫర్లు క్యూకడుతున్నాయి. ఈ క్రమంలో మమితకు సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మమిత అనేది తన అసలు పేరు కాదని.. తన పేరు మారడం వెనుక పెద్ద కథే ఉందని ఈ ప్రేమలు బ్యూటీ చెప్పుకొచ్చింది.
మమిత అసలు పేరు నమిత. హాస్పిటల్ సిబ్బంది బర్త్ సర్టిఫికెట్లో పొరపాటున ‘N’ అనే అక్షరానికి బదులు ‘M’ అనే అక్షరాన్ని రాశారు. దీంతో నమిత కాస్త మమితగా మారింది. అయితే బర్త్ సర్ట్ఫికెట్ ఇష్యూ అయిన టైమ్‌లో ఆమె పేరెంట్స్ చూసుకోలేదు. స్కూల్లో జాయిన్ చేయాల్సిన సమయంలో ఈ విషయాన్ని గుర్తించారు. అయితే విభిన్నంగా ఉందని భావించిన వాళ్లు ఆ పేరును అలాగే ఉంచేశారు. అంతేకాదు మమిత అంటే మలయాళంలో మిఠాయి అనే అర్థం కూడా ఉంది. దీంతో స్వీట్‌గా ఉంటుందని మమిత పేరెంట్స్ అనుకున్నారట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మమిత చెప్పుకొచ్చింది.
అన్నట్టు ప్రేమలు సినిమా మమితకు తొలి సినిమా ఏమీ కాదు.. ఈ సినిమా కంటే ముందు మలయాళంలో ఆమె 15 సినిమాల్లో నటించింది. రీసెంట్గా జీవీ ప్రకాశ్ నటించిన రెబల్ సినిమాతో కోలీవుడ్లోకి కూడా అడుగుపెట్టింది. ప్రస్తుతం విష్ణు విశాల్‌తో తమిళంలో ఒక సినిమా చేస్తుంది. కాగా, ప్రేమలు సినిమా తర్వాత తెలుగులోనూ మమితకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. విజయ్ దేవరకొండ సినిమాలోనూ మమిత బైజును హీరోయిన్గా ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

