PBKS vs CSK : స్వల్ప ఛేదనలో పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు భారీ షాక్. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(7), రీలే రస్సో(0)లు పెవిలియన్ చేరారు. సీఎస్కే యువ పేసర్ తుషార్ దేశ్‌పాండే(Tushar Deshpande) ఒకే ఓవర్లో ఈ ఇద్దరిని బౌల్డ్ చేశాడు.
దాంతో, 9 పరుగుల వద్ద రెండు పడిన జట్టును ఇంప్యాక్ట్ ప్లేయర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(20), శశాంత్ సింగ్(18)లు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దేశ్‌పాండే వేసిన ఆరో ఓవర్లో ప్రభ్సిమ్రాన్ వరుసగా 4, సిక్స్ బాదాడు. దాంతో, పవర్ ప్లేలో పంజాబ్ వికెట్ నష్టానికి 47 పరుగులు స్కోర్ చేసింది. ఇంకా సామ్ కరన్ సేన విజయానికి 121 పరుగులు కావాలి.