RS Praveen Kumar | మల్లు రవికి ప్రశ్నలు సంధిస్తూ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సోషల్ మీడియా పోస్టు..!
RS Praveen Kumar | నాగర్‌కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి ప్రశ్నలు సంధిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ఇవాళ ఎర్రవల్లిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో జరిగే సభలో తన ప్రశ్నలపై ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
RS Praveen Kumar : నాగర్‌కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి ప్రశ్నలు సంధిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ఇవాళ ఎర్రవల్లిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో జరిగే సభలో తన ప్రశ్నలపై ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ ఎంపీగా వేల కోట్లు ఎలా సంపాదించారో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.
మీరు ఆస్తులు సంపాదిస్తే మీకు ఓట్లేసిన ప్రజలు ఇంకా కటిక దరిద్రంలోనే ఉండి ఎందుకు వలసపోతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నించారు. ఎంపీగా గెలువకుముందు హైదరాబాద్‌లో ఇళ్లు లేని మీకు కోట్ల విలువచేసే ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు. నాగర్‌కర్నూల్ ఎంపీగా గెలిచి మల్లు రవి, ఆయన కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని, నియోజకవర్గం మాత్రం అభివృద్ధి కాలేదని విమర్శించారు.
మల్లు రవిని మళ్లీ గెలిపిస్తే మరిన్ని ఆస్తులు సంపాదించుకుంటారే తప్ప నియోజకవర్గానికి ఆయన ఏమీ చేయరని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మల్లు రవి కుంటుంబం పలు కంపెనీలు స్థాపించిందని, కానీ నియోజకవర్గ యువత కోసం ఆయన ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేకపోయారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజల కోసం చేసింది ఏమీ లేదు కాబట్టి.. ‘మల్లూ ఇక వెనక్కి వెళ్లు’ అని చివరల్లో క్యాప్షన్ ఇచ్చారు.
అయ్యా మల్లు రవి గారు,
ఈ రోజు ఎర్రవల్లిలో @RahulGandhi గారి సాక్షిగా మీరు కింది సమాచారం మీద కందనూలు నడిగడ్డ ప్రజలకు వివరణ ఇస్తారనే ఆశిస్తున్నా.గతంలో నాగర్ కర్నూల్ ఎంపీగా ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించుకున్నారు? మీకు ఓటేసిన ప్రజలేమో కటిక దరిద్రంలో ఉండి ఎందుకు వలస…
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) May 5, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

