Husnabad | సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. రిటైర్మెంట్ డబ్బుల కోసం భర్తను భార్య రోకలిబండతో కొట్టి హతమార్చడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..స్థానిక హనుమాన్ నగర్లో చెందిన వెంకటేశం- రాజమణి దంపతులు నివస్తున్నారు. వెంకటేశం ఆసిఫాబాద్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. రాజమణి ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నది.
అయితే ఈ నెలలో వెంకటేశం పదవీ విరమణ చేయాల్సి ఉండగా, రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి విషయంలో దంపతులు గొడవపడ్డారు. ఈ గొడవ పెద్దదిగా మారడంతో ఆగ్రహించిన రాజమణి భర్తను రోకలిబండతో కొట్టి దారుణంగా హతమార్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రాజమణిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.