చదువుతోనే ఉన్నత శిఖరాలు : బక్కి వెంకటయ్య
అంబేద్కర్ చెప్పినట్లు విద్యతో ప్రపంచాన్ని జయించవచ్చని, విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం ఆయన దేవరకొండ డివిజన్ పరిధిలోని కొండమల్లేపల్లి...
కొండమల్లేపల్లి, సెప్టెంబర్ 25 : అంబేద్కర్ చెప్పినట్లు విద్యతో ప్రపంచాన్ని జయించవచ్చని, విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం ఆయన దేవరకొండ డివిజన్ పరిధిలోని కొండమల్లేపల్లి మండలం, డింజలాల్ తండా బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో వంట గది, స్టోర్ రూమ్, పరిసరాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, కూరగాయలు, వంటనూనె, పండ్లు, గుడ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు వాష్‌రూమ్‌లు, కాంపౌండ్ వాల్, బోరు అవసరముందని తెలిపారు.

చదువుతోనే ఉన్నత శిఖరాలు : బక్కి వెంకటయ్య
సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కలెక్టర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అక్టోబర్ 2న గ్రామ సభలో తీర్మానం చేసి వీ బిజీ రాంజీ నిధుల కింద పనులకు శంకుస్థాపన చేయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బోరు కూడా వేయిస్తామని చెప్పారు. విద్యార్థులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూచించినట్లు తరగతి గదిలోనే తమ భవిష్యత్‌కు పునాది వేసుకోవాలని, క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు మంచి భవిష్యత్‌ను నిర్మించుకోవాలని సూచించారు.

చదువుతోనే ఉన్నత శిఖరాలు : బక్కి వెంకటయ్య
కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్నారు. ప్రభుత్వం సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నందున విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రేణిగుంట ప్రవీణ్, లక్ష్మీ నారాయణ, జిల్లా శంకర్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ తియాన్ మావి, డిటిడిఓ కమలాకర్ రెడ్డి, ఆర్ సి ఓ శ్రీనివాసరావు, ఏ సి ఎం ఓ వెంకటేశ్ నాయక్, ఏ టి డి వెంకటేశ్వర్, ఎంపీడీవో స్వర్ణలత, తాసీల్దార్ నరేందర్, ఎంపీఓ సుధీర్ కుమార్, సర్పంచ్ గోజి రతన్‌లాల్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, ప్రిన్సిపాల్ శారద, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

