గుర్రంపోడ్, సెప్టెంబర్ 25 : బీఆర్ఎస్ అమెరికా శాఖ ప్రదాన కార్యదర్శి నాగులవంచ నర్సింహ్మరావు జన్మదిన వేడుకలను శుక్రవారం గుర్రంపోడ్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ గుర్రంపోడ్ మండల మాజీ అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ పాఠశాలకు ప్యాన్లు, లైట్లను బహుకరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సింగం బాలకృష్ణ, అందుగుల శ్రీను, సల్వాది సరస్వతి నగేష్, నాయకులు కామల్ల రాములు, నాగులవంచ నాగేశ్వర్రావు, షేక్ సిరాజ్, కూనూరు సైదిరెడ్డి, దోటి గణేష్, చింతరెడ్డి రవీందర్ రెడ్డి, పర్సనబోయిన వెంకన్న, సంకటి గిరిబాబు, కుందారపు యాదగిరి, నారోజు వెంకటాచారి, జెల్ల లింగయ్య పాల్గొన్నారు.

ఘనంగా నర్సింహ్మరావు జన్మదిన వేడుకలు