సందేశంతో ‘రాజిగాడు రాజయ్యాడు’
స్వీయ దర్శకత్వంలో అల్తాఫ్ హసన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రాజిగాడు రాజయ్యాడు’. ఈ సినిమాలో ప్రముఖ కవి, గాయకుడు డా॥ గోరటి వెంకన్న కీలక పాత్రను పోషిస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో టీజర్‌ను విడుదల చేశారు.
స్వీయ దర్శకత్వంలో అల్తాఫ్ హసన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రాజిగాడు రాజయ్యాడు’. ఈ సినిమాలో ప్రముఖ కవి, గాయకుడు డా॥ గోరటి వెంకన్న కీలక పాత్రను పోషిస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం గొప్ప కథను ఎంచుకున్నారు. ఇప్పటికీ మూడుసార్లు సినిమా చూసినా బోర్ కొట్టలేదు. తెరపై ఓ జీవితాన్ని చూసిన అనుభూతి కలిగింది. ఇందులో నేనొక మంచి పాత్రను పోషించాను.
మూస చిత్రాలకు భిన్నంగా అల్తాఫ్ ఓ చరిత్ర సృష్టించబోతున్నాడు’ అన్నారు. ప్రతీ ఒక్కరికి స్ఫూర్తినిచ్చే కథ ఇదని, గోరటి వెంకన్న తన తండ్రి పాత్రలో నటించారని నటుడు, దర్శకుడు అల్తాఫ్ హసన్ అన్నారు. అనుశ్రీ, గోరటి వెంకన్న, గీతా అగర్వాల్, రాజేంద్రమోహన్, శ్రీవర్ధన్ త్రివేది తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.మణికర్ణన్, సంగీతం: జగదీశ్ సత్యన్, కథ: డా॥ విజయ్‌భాస్కర్, నిర్మాతలు: బత్తుల పర్విన్, మనోజ్ అర్రోల, చిన్ని, దర్శకత్వం: అల్తాఫ్ హసన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

