ఆర్టీసీ నీళ్లివ్వకున్నా చార్జీ వసూలు
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకొనే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. ప్రయాణికులకు బస్సులో తాగునీరు ఇవ్వకుండా నిలువు దోపిడీ చేస్తున్నది.
- 15 రోజులుగా జీవా వాటర్ బంద్
- సూపర్ లగ్జరీ, ఆపై బస్సుల్లో సరఫరా నిలిపివేత
- టికెట్ ధరలో మాత్రం అదనంగా రూ.10 వసూలు
- వాటర్ చార్జీలతో రోజుకు రూ.6.96 లక్షల ఆదాయం
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకొనే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. ప్రయాణికులకు బస్సులో తాగునీరు ఇవ్వకుండా నిలువు దోపిడీ చేస్తున్నది. దూరప్రాంతాలకు వెళ్లే హైఎండ్ బస్సులైన సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, లహరి ప్రయాణికులకు మంచినీటి సౌకర్యం నవంబర్ నుంచే అందుబాటులో లేకుండాపోయిందని ప్రయాణికులు చెప్తున్నారు.
మరోవైపు నీటి సౌకర్యానికి సంబంధించి డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు జీవా బ్రాండ్‌తో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అందించేందుకు 2023లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రైవేటు సంస్థలతో ఒప్పందం చేసుకుని నీటి బాటిళ్లను సరఫరా చేస్తున్నది. ఈ వ్యవహారంలో ఫౌంటెన్ స్ప్రింగ్స్ సంస్థ కీలక సరఫరదారుగా వ్యవహరించింది. 2023 జూలై 5న టెండర్ ప్రక్రియ చేపట్టి, అదే ఏడాది అక్టోబర్ 7న వర్ఆర్డర్, పర్చేజ్ ఆర్డర్ జారీ చేసింది.
అక్టోబర్ 27న సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్నది. ఈ ఏడాది అక్టోబర్ 6తో పాత ఒప్పందం గడువు ముగిసింది. ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా బస్సు సర్వీసుల్లో 500 ఎంఎల్ జీవా వాటర్ బాటిళ్లను అందిస్తున్నది. ఒకో బాటిల్‌కు ప్రయాణికుల నుంచి రూ.10 చొప్పున వసూలు చేస్తున్నట్టు పేరొన్నారు. రోజుకు సింగిల్ ట్రిప్‌నకు 34,812 బాటిళ్లు, డబుల్ ట్రిప్‌నకు 69,624 బాటిళ్లు అవసరమవుతున్నట్లు ఆర్టీసీ గణాంకాలు చెప్తున్నాయి. ఈ లెకన రోజుకు రూ.6,96,240 ఆదాయం సమకూరుతున్నది. కానీ నీళ్లు ఇవ్వకుండానే డబ్బులు వసూలు చేయడం ఏ న్యాయం? అన్న ప్రయాణికుల ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆర్టీసీ యాజమాన్యంపై ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

