నేటి మధ్యాహ్నం తీరం దాటనున్న ‘అక్వాన్’
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాన్ ‘అక్వాన్' క్రమంగా తీరం వైపు కదులుతున్నది. గురువారం ఉదయానికి ఏపీలోని నర్సాపూర్‌కు తూర్పు-ఆగ్నేయంగా సుమారు 420 కిలోమీటర్లు, కళింగపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 490 కిలోమీటర్లు, పూరీకి 550 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు-ఈశాన్యంగా 590 కిలోమీటర్ల దూరంలో తుపాన్ కదలికలు నమోదయ్యాయి.
- రాష్ట్రంలో తేలిక నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాన్ ‘అక్వాన్’ క్రమంగా తీరం వైపు కదులుతున్నది. గురువారం ఉదయానికి ఏపీలోని నర్సాపూర్‌కు తూర్పు-ఆగ్నేయంగా సుమారు 420 కిలోమీటర్లు, కళింగపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 490 కిలోమీటర్లు, పూరీకి 550 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు-ఈశాన్యంగా 590 కిలోమీటర్ల దూరంలో తుపాన్ కదలికలు నమోదయ్యాయి.
వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం.. అక్వాన్ తుపాన్ ఉత్తర-వాయవ్య దిశగా ప్రయాణిస్తూ నవంబర్ 20 మధ్యాహ్నం వేళకు తీరం దాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఉత్తర ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీరాల మధ్య నర్సాపూర్, పూరి మధ్య ప్రాంతంలో, ముఖ్యంగా గోపాల్‌పూర్‌కు తూర్పున ఇది తీరాన్ని తాకవచ్చని అధికారులు తెలిపారు. తెలంగాణలో శుక్ర, శనివారాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
పడిపోయిన ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలుగా నమోదయ్యాయి. సంగారెడ్డిలో 11.1, ఆదిలాబాద్‌లో 11.2, వికారాబాద్‌లో 11.3, నిజామాబాద్‌లో 11.4, రాజన్న సిరిసిల్లలో 11.4, నిర్మల్‌లో 11.5, కరీంనగర్, కామారెడ్డి, రంగారెడ్డి, సిద్దిపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 11.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

