Chandigarh | చండీగఢ్‌లో హెడ్ కానిస్టేబుల్ కాల్చివేత.. కొడుకే హత్య చేశాడా
Chandigarh : చండీగఢ్‌లో ఒక హెడ్ కానిస్టేబుల్ అనుమానాస్పదంగా మరణించాడు. తుపాకీతో కాల్చడం వల్ల అతడు మరణించాడు. అయితే, అతడి కొడుకే ఈ హత్యకు పాల్పడ్డాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Chandigarh : చండీగఢ్‌లో ఒక హెడ్ కానిస్టేబుల్ అనుమానాస్పదంగా మరణించాడు. తుపాకీతో కాల్చడం వల్ల అతడు మరణించాడు. అయితే, అతడి కొడుకే ఈ హత్యకు పాల్పడ్డాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. నితిన్ అనే హెడ్ కానిస్టేబుల్ చండీగడ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్, అకౌంట్స్ బ్రాంచ్‌లో పని చేస్తున్నాడు.
సెక్టార్ 22లోని తన ఇంటిలో నితిన్ కాల్పుల కారణంగా మరణించాడు. ఉదయం ఇంటి నుంచి కాల్పుల శబ్దం వినిపించిందని ఇరుగుపొరుగు వారు చెప్పారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో నితిన్ భార్య, కొడుకు ఇంట్లోనే ఉన్నారు. అయితే, ఈ కాల్పులు ఎవరు జరిపారు.. అతడు ఎలా మరణించాడు.. కారణాలు ఏంటి అనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలం నుంచి ఒక దేశీ పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ పిస్టల్ నుంచి వచ్చిన బుల్లెట్ కారణంగానే నితిన్ మరణించినట్లు తేలింది. చండీగఢ్ ఎస్ఎస్పీ కన్వర్దీప్ కౌర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు ఆధారాలు సేకరించారు. అయితే, ప్రాథమికంగా నితిన్ మైనర్ కొడుకు ఈ కాల్పులకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే, ఈ విషయంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి స్పష్టతనివ్వలేమని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని, ఆ తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని కౌర్ వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

