బూర్గంపహాడ్, సెప్టెంబర్ 25 : వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్, రీజియన్-1, జోన్-2 ఆధ్వర్యంలో జోన్ చైర్మన్ భూమా వెంకటచంద్రశేఖర్ అధ్యక్షతన శుక్రవారం వాసవీక్లబ్ గ్రేటర్ సారపాక ఆతిథ్యంతో భూమా జోన్ సోషల్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను జోన్ ప్రథమ మహిళ భూమా వెంకట నాగలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కొత్తా వెంకటేశ్వరరావు హాజరై వాసవీ క్లబ్ సమాజ హితమే ధ్యేయంగా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. సమాజ సేవలో విశేష కృషిని కొనియాడారు.
అనంతరం వాసవీక్లబ్ సారపాక గ్రేటర్, వాసవీక్లబ్ వనిత సారపాక, వాసవీ క్లబ్ మణుగూరు క్లబ్‌కు ప్రముఖుల చేతుల మీదుగా సేవా పురస్కారాలు అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ మాసెట్టి వరప్రసాద్, విశిష్ట అతిథులు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ చింతల వినోద్‌కుమార్, రేపాక ధనుంజయ రాజమనోహర్, క్యాబినెట్ ట్రెజరర్ ఉడతా నగేశ్కుమార్తో పాటు మాస్టర్ ఆఫ్ సెర్మనీస్ కేసీజీఎఫ్ ఇన్చార్జి కేతేపల్లి ప్రవీణ్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు, జిల్లా ఆఫీసర్లు, మూడు క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, మహిళా విభాగం ప్రతినిధులు, వాసవీక్లబ్ సభ్యులు పాల్గొన్నారు.