గాలే: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్(SLvIND Test)లో భారత జట్టు పట్టు బిగించింది. మూడో రోజు భోజన విరామ సమయానికి శ్రీలంక తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 99 రన్స్ చేసింది. ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 462 రన్స్ చేసి ఆలౌటైంది. ప్రస్తుతం శ్రీలంక ఇంకా 363 రన్స్ వెనుకబడి ఉన్నది. సిరాజ్ తన ఓపెనింగ్ ఓవర్లోనే నిషాన్ ఫెర్నాండోను డకౌట్ చేశాడు. ఆ తర్వాత మానవ్ సుతార్ వరుసగా రెండు వికెట్లు తీసుకున్నాడు. దినేశ్ చండీమాల్, లహిరు ఉడారాలను ఔట్ చేశాడు. కుల్దీప్ యాదవ్ కూడా ఓ వికెట్ తీసుకున్నాడు.
శ్రీలంక బ్యాటర్లలో కమిందు మెండిస్ 14, ఉడార 27 రన్స్ చేశారు. తొలుత ఇండియా ఇవాళ 9 వికెట్లకు 460 రన్స్ వద్ద బ్యాటింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత 116.4 ఓవర్లలో 462 రన్స్‌కు ఆలౌటైంది. ఇండియన్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో దేవదత్ పడిక్కల్ అత్యధికంగా 167 రన్స్ చేశాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 109 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. ఆదివారం రోజు వర్షం వల్ల రెండు సెషన్ల ఆట నిలిచిపోయిన విషయం తెలిసిందే. కుల్దీప్ బౌలింగ్‌లో కమిందు మెండిస్ ఇచ్చిన క్యాచ్.. ఎడమ వైపు డైవ్ చేసి గిల్ అద్భుతంగా అందుకున్నాడు.
Outstanding unbelievable catch by Captain Shubman Gill 🛐 🔥🫡 pic.twitter.com/OAPAOqjY9k
— Shubman X 77 (@AyushKumar77297) August 17, 2026