Team India | విదేశీ పర్యటనలో వెరైటీగా.. బుల్లెట్ ట్రైన్లో భారత క్రికెటర్లు..!
Team India : ఆసియా క్రీడల కోసం భారత పురుషుల క్రికెట్ బృందం జపాన్ చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న టీమిండియా స్వర్ణమే లక్ష్యంగా శనివారం ఆతిథ్య నగరంలో అడుగుపెట్టింది.
Team India : ఆసియా క్రీడల కోసం భారత పురుషుల క్రికెట్ బృందం జపాన్ చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న టీమిండియా స్వర్ణమే లక్ష్యంగా శనివారం ఆతిథ్య నగరంలో అడుగుపెట్టింది. విదేశీ పర్యటనల్లో మాదిరిగా బస్సులో కాకుండా ఇక్కడ జెట్ స్పీడ్తో దూసుకెళ్లే రైల్లో ప్రయాణించారు భారత క్రికెటర్లు. రాజధాని టోక్యో నుంచి నగోయ(Nagoya)కు బుల్లెట్ ట్రైన్ (Bullet Train) వెళ్లారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సేనకు సంబంధించిన ఫొటోలను ‘టోక్యో టు నగయ’ అంటూ బీసీసీఐ (BCCI) పంచుకుంది.
పద్దెనిమిదో ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు పసిడి వేటకు సిద్ధమైంది. మూడేళ్ల క్రితం రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో హంగ్జౌ(చైనా)లో స్వర్ణం కొల్లగొట్టిన టీమిండియా.. క్వార్టర్ ఫైనల్లో అఫ్గనిస్థాన్ను ఢీకొట్టనుంది. సెప్టెంబర్ 28న జరగనున్న ఈ మ్యాచ్ కోసం కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, కోచింగ్ బృందం శనివారం నగోయ చేరుకుంది. ఆతిథ్య నగరానికి వెళ్లడానికి జపాన్లో ప్రత్యేకమైన బుల్లెట్ రైళ్లో టీమిండియా ఆటగాళ్లు ప్రయాణించారు.
Tokyo ➡️ Nagoya at bullet speed 🚄
Good vibes only as #TeamIndia have arrived for the #AsianGames 2026 🙌 pic.twitter.com/0bLpTgvUn6
— BCCI (@BCCI) September 26, 2026
మామూలుగా విదేశీ పర్యటనల్లో హోటల్ లేదా స్టేడియానికి బస్సులో వెళ్లడం మనోళ్లకు అలవాటే. కానీ, ఈసారి కొత్తగా బుల్లెట్ ట్రైన్ జర్నీని మన ఆటగాళ్లు ఎంతో ఎంజాయ్ చేశారు. ‘భలేగుందీ బుల్లెట్ ప్రయాణం’ అని థ్రిల్ ఫీలయ్యారు కూడా. అంతేనా.. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సరదాగా ఆ బుల్లెట్ ట్రైన్ను తన ఫోన్లలో ఫొటో తీసి మురిసిపోయాడు. తొలి క్వార్టర్ ఫైనల్లో సెప్టెంబర్ 28న భారత్, అఫ్గనిస్థాన్ తలపడనున్నాయి. అదే రోజు పాకిస్థాన్, హాంకాంగ్ చైనా మధ్య రెండో క్వార్టర్స్ జరుగనుంది.
భారత స్క్వాడ్ : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి, శివం దూబే, అక్షర్ పటేల్, సుందర్, రవి బిష్ణోయ్, బుమ్రా, అర్ష్దీప్, విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

