PBKS vs CSK | ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే మొదటి వికెట్‌ను కోల్పోయింది. హర్షదీస్ సింగ్ వేసిన ఐదో బంతికి అజింక్యా రహానే(Ajinkya Rahane) (9) రబాడకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చాలా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని రబాడ అద్భుతంగా ఒడిసిపట్టాడు. రెండు ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే స్కోర్ 17/1.కాగా, సీఎస్కే 10 మ్యాచులు ఆడి ఐదు గెలిచి ఐదింటిలో ఓడిపోయి 10 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నది. 10 మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు గెలిచిన పంజాబ్ కింగ్స్ 8 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది.