Unni Mukundan | ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ ‘యశోద’, మాలికాపురం (Malikapuram) వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan). ఇప్పుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మార్కో (Marco). మైఖేల్, ది గ్రేట్ ఫాదర్ సినిమాల ఫేమ్ హనీఫ్ అదేని (Haneef Adeni) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ జానర్లో రానున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మూవీ నుంచి మోషన్ పోస్టర్‌ను విడుదల చేయగా.. సిగార్ (CIGAR) పట్టుకుని యాక్షన్ మోడ్‌లో ఉన్న ముకుందన్ లుక్ ఫుల్ వైరల్ అయ్యింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి బాలీవుడ్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా హిందీ హక్కులను రూ.5 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం.
2024లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ హై బడ్జెట్ యాక్షన్ మూవీని క్యూబ్స్ ఎంటర్టైనర్ బ్యానర్‌పై షరీఫ్ మహ్మద్ అబ్దుల్ గదాఫ్ నిర్మిస్తుండగా.. ప్రేమమ్ సినిమా హీరో నివిన్ పాలీ ఈ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నట్లు సమాచారం.
Hindi dubbing rights of #UnniMukundan‘s #Marco has been acquired for massive 5Cr+💥
Marco, a spin-off to Malayalam movie Mikhael, is an action entertainer !! pic.twitter.com/UAfV5lSRLU
— AmuthaBharathi (@CinemaWithAB) May 5, 2024