కేప్‌టౌన్: అభిమానులను మైదానానికి రప్పించేందుకు గాను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తీసుకొచ్చిన కాంటెస్ట్ (క్యాచ్2మిలియన్).. మ్యాచ్‌లు చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌కు కనవర్షం కురిపిస్తున్నది. ఎస్ఏ 20 తాజా సీజన్లో భాగంగా మ్యాచ్‌లకు వచ్చే అభిమానుల్లో ఎవరైనా క్లీన్, వన్ హ్యాండెడ్ క్యాచ్‌లు అందుకుంటే వారికి 2 మిలియన్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 1.07 కోట్లు) అందజేస్తామని దక్షిణాఫ్రికా బోర్డు ప్రకటించింది.
కాగా, ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్స్ ఎంఐ కేప్‌టౌన్.. డర్బన్ సూపర్ జెయింట్స్ మ్యాచ్‌తో పాటు ప్రిటోరియా క్యాపిటల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ పోరులో ఇద్దరు అభిమానులు క్యాచ్‌లు అందుకుని జాక్‌పాట్ కొట్టారు.
కేప్‌టౌన్ బ్యాటర్ వికెట్ కీపర్ బ్యాటర్ రియాన్ రికెల్టన్ (113) డర్బన్‌తో మ్యాచ్‌లో 11 సిక్సర్లు కొట్టగా అందులో ఒకదానిని స్టాండ్స్‌లో ఉన్న అభిమాని సింగిల్ హ్యాండ్‌తో అందుకుని కాంటెస్ట్ విన్నర్‌గా నిలిచాడు. ప్రిటోరియా, జోబర్గ్ సూపర్ కింగ్స్ మ్యాచ్‌లోనూ మరో అభిమాని ఇలాగే క్యాచ్ అందుకున్నాడు.