NZ vs SA : పొట్టి ప్రపంచకప్‌లో అజేయంగా సెమీస్‌కు దూసుకొచ్చిన దక్షిణాఫ్రికా సెమీఫైనల్లో తడబడినా.. మార్కో యాన్సెన్(55 నాటౌట్) మెరుపులతో భారీ స్కోర్ చేసింది. కొలే మెక్కొన్చీ(2-9) విజృంభణతో టాపార్డర్.. మిడిలార్డర్ కుప్పకూలిన చోట.. ఈ బక్కపలచని ఆల్‌రౌండర్ దంచేశాడు. డెవాల్డ్ బ్రెవిస్(34) ఔటయ్యాక ట్రిస్టన్ స్టబ్స్(29) జతగా అటాకింగ్ గేమ్‌తో న్యూజిలాండ్ బౌలర్ల లయను దెబ్బతీసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. సఫారీలను పోటీలోకి తీసుకొచ్చిన యాన్సెన్.. ఆఖరి ఓవర్లో మరింత చెలరేగాలనుకున్నా మ్యాట్ హెన్రీ(2-34) ఆ అవకాశమివ్వలేదు. అతడు వరుసగా రెండు వికెట్లు తీయడంతో ప్రొటీస్ జట్టు 169 పరుగులకే పరిమితమైంది.
ఎదురైన ప్రత్యర్ధినల్లా ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే పెద్ద షాకిచ్చారు న్యూజిలాండ్ పేసర్లు. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ క్వింటన్ డికాక్(10), రియాన్ రికెల్టన్(0)లను వరుస బంతుల్లో ఔట్ చేసిన కొలే మెక్కొన్చీ(2-9) సఫారీల శుభారంభానికి పగ్గాలు వేశాడు. మెక్కొనిచ్చీ ఊరిస్తూ సంధించిన బంతిని మిడాన్‌లో గాల్లోకి లేపిన డికాక్.. ఫెర్గూసన్ చేతికి చిక్కాడు. ఆ వెంటనే వచ్చిన రికెల్టన్ ఆఫ్ సైడ్ కట్ షాట్ ఆడి ఫిన్ అలెన్‌కు దొరికిపోయాడు.
🚨 Change of Innings 🚨#TheProteas finish their innings at 169/8 after 20 overs following an impressive fightback. 🙌🏟
A defendable total on the board, with plenty for our bowlers to work with. 🇿🇦👏#Unbreakable #T20WorldCup pic.twitter.com/BO95qdpNk8
— Proteas Men (@ProteasMenCSA) March 4, 2026
అనంతరం ఫెర్గూసన్ ఓవర్లో మర్క్రమ్(18) సైతం ఔటయ్యేవాడే. కానీ, రచిన్ రవీంద్ర డైవ్ చేస్తూ క్యాచ్ పట్టబోయి నేలపాలు చేశాడు. లైఫ్ లభించడంతో గేర్ మార్చిన్ మర్క్మర్.. డెవాల్డ్ బ్రెవిస్(15)లు ధాటిగా ఆడుతున్నారు. నీషం ఓవర్లో మర్క్రమ్ ఫోర్, సిక్సర్ బాదేయగా.. బ్రెవిస్ రెండు ఫోర్లతో 17 రన్స్ వచ్చాయి. పవర్ ప్లే చివరి ఓవర్లో ఫెర్గూసన్ మూడే పరుగులివ్వగా.. 6 ఓవర్లకు సఫారీ జట్టు 2 వికెట్ల నష్టానికి 48 కొట్టింది.
Marco 𝗖𝗟𝗨𝗧𝗖𝗛 Jansen 🔥
Entered at 77/5 & played an innings of a lifetime to guide South Africa a fighting total! 🙌
ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/CCD0QTflth
— Star Sports (@StarSportsIndia) March 4, 2026
సూపర్ 8లో బంతితో మాయ చేసిన.. రచిన్ రవీంద్ర ఓవర్లో డారిల్ మిచెల్ స్టన్నింగ్ క్యాచ్‌కు మర్క్రమ్ వెనుదిరిగాడు. అనంతరం 5 పరుగుల వద్ద డెవిడ్ మిల్లర్(6)ను పెవిలియన్ పంపే అవకాశాన్ని ఫిలిప్స్ వదిలేశాడు. బంతిని అందుకున్నట్టే అందుకున్న అతడు.. పట్టుతప్పి కిందపడే క్రమంలో బంతిని వదిలేశాడు. కానీ, మిల్లర్ పెద్ద షాట్ ఆడబోయి.. బౌండరీ లైన్ వద్ద డారిల్ మిచెల్‌కు సులువైన క్యాచ్ ఇచ్చి డగౌట్ చేరగా.. 77 వద్ద ఐదో వికెట్ పడింది. మిల్లర్ అలా వెళ్లి కూర్చున్నాడో లేదో.. నీషమ్ ఓవర్లో కవర్స్‌లో ఆడిన బ్రెవిస్ కెప్టెన్ శాంట్నర్‌కు దొరికి వికెట్ పారేసుకున్నాడు. సగం హిట్టర్లంతా పెవిలియన్ చేరిన వేళ ట్రిస్టన్ స్టబ్స్(29), మార్కో యాన్సెన్(55 నాటౌట్: 30 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు)లు కీలక ఇన్నింగ్స్ ఆడారు.
కివీస్ బౌలర్ల జోరుతో 77కే సగం వికెట్లు పడినా స్టబ్స్, యాన్సెన్ ఒత్తిడికి లోనవ్వలేదు. హెన్రీ వేసిన 17వ ఓవర్లో యాన్సెస్ సిక్సర్.. స్టబ్స్ ఫోర్‌తో గేర్ మార్చారు. ఆపై నీషమ్‌కు చుక్కలు చూపించిన స్టబ్స్.. ఫోర్, సిక్సర్ బాదగా.. యాన్సెన్ సిక్సర్‌తో స్కోర్ 150కి చేరింది. అర్ధ శతకం భాగస్వామ్యంలో సఫారీలను ఆదుకుంది. ఆరో వికెట్‌కు 73 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని స్టబ్స్‌ను బౌల్డ్ చేసి ఫెర్గూసన్ విడదీశాడు.
A vital knock from Marco Jansen lifts South Africa to a competitive total against New Zealand 🏏#T20WorldCup2026 #SAvsNZ #Semifinal #MarcoJansen #CricketTwitter pic.twitter.com/GBleoiElzE
— InsideSport (@InsideSportIND) March 4, 2026
కానీ, యాన్సెస్ మాత్రం తగ్గేదేలే అన్నట్టు.. రెండు సిక్సర్లతో ఫిఫ్టీ సాధించాడు. చివరి ఓవర్లోనూ భారీగా రన్స్ పిండుకోవాలనుకున్న సఫారీలకు చెక్ పెడుతూ.. సూపర్ యార్కర్‌తో బాష్(2)ను హెన్రీ(2-34) బౌల్డ్ చేశాడు. ఆఖరి మూడు బంతుల్లో రన్స్ రావడంతో.. మర్క్రమ్ సేన కివీస్‌కు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.