ముంబై: భారత క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను టెస్టుల్లో తొలగించి ఆ బాధ్యతలను దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు అప్పగిస్తారని వస్తున్న వార్తలపై బీసీసీఐ స్పందించింది. అవన్నీ ఊహాజనితమని, అసలు అలాంటి చర్చే జరుగలేదని బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా తెలిపారు. ఇదే విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘కోచ్ మార్పుపై వస్తున్న వార్తలు అవాస్తవం.
అవన్నీ పూర్తిగా ఊహాజనితమైనవి. కొన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీలు కూడా ఇలాంటివి ప్రచారం చేయడం సరికాదు. అసలు బోర్డులో అలాంటి (కోచ్ మార్పు) చర్చే జరుగలేదు. కొంతమంది వారికి తోచిన విధంగా ఆలోచించి దానిని నిజమని ప్రచారం చేస్తుంటారు. గంభీర్ కాంట్రాక్టు 2027 ప్రపంచకప్ వరకూ ఉంది. అతడిపై మాకు పూర్తి నమ్మకముంది. మేం ఎవరినీ సంప్రదించలేదు’ అని తెలిపాడు.