Telangana Budget : తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కీలకమైన ఘట్టానికి ముహర్తం కుదిరింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేపు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. శుక్రవారం ఉదయం బడ్జెట్ను ప్రభుత్వం ఆమోదించనుంది. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ను ప్రవేశ పెడుతారు. శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీల ఆశ చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. నిరుడు మార్చి 19న రూ. 3.05 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ను శాసన సభ ముందుంచిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈసారి అంకెల గారీడీలు చేస్తారా? అభివృద్ధి, సంక్షేమానికి భారీగా కేటాయిస్తారా? అనేది రేపు మధ్యాహ్నం లోపు తెలియనుంది.