Ugadi Utsavam : తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని సొసైటీ సభ్యులు స్థానిక పోటోన్గ్ పాసిర్లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం ప్రత్యేకంగా రాయించిన గంటల పంచాంగాన్ని సభ్యులకు అందజేశారు.
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను పునస్కరించుకొని గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత శ్రీ బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్రీ శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి) సిద్ధం చేశారు. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి, పులిహోర, దద్దోజనం మొదలగు ప్రసాదం పంపిణి చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం అని ఉగాది వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.

ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డిలు వ్యవహరించారు. ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్, సంతోష్ కుమార్ జూలూరి, ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలకమయ్యారు.
ఉగాది వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి, ప్రసాదాన్ని సమకూర్చిన దాతలకు, స్పాన్సర్లకు, సంబురాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
ఈ వేడుకల ఘనంగా జరగడానికి చేయూతనందించిన మై హోమ్ బిల్డర్స్, కుమార్ ప్రాపర్టీస్ (ప్రాప్నెక్స్) సింగపూర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, సరిగమ గ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, ఏవిఏం కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సౌజన్య డెకార్స్కు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉగాది వేడుకలకు ఆర్థిక సహకారం అందించిన నాగులపల్లి శ్రీనివాస్, డెలీసియస్ బిర్యాని బై ఫీస్ట్రో, నండూరి సునీత, మహేష్ చెట్టిపెల్లికి సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.