కారేపల్లి, మార్చి 19 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, ఐద్వా(AIDWA) వ్యవ స్థాపకుల్లో ఒకరైన మల్లు స్వరాజ్యం (Mallu Swarajyam) జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ఐద్వా వైరా డివిజన్ అధ్యక్షురాలు కొండబోయిన ఉమావతి అన్నారు. స్వరాజ్యం 4వ వర్థంతిని పురస్కరించుకొని బుధవారం కారేపల్లిలో ఆమె చిత్రపటాల వద్ద ఐద్వా నాయకురాళ్లు నివాళులర్పించారు.
మల్లు స్వరాజ్యం వర్ధంతి సందర్భంగా ఉమావతి మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తిని కొనియాడారు. 12 ఏళ్ల వయస్సులోనే వెట్టి చాకిరి, బానిసత్వానికి వ్యతిరేకంగా నాటి దొరలు, జాగీరుదారులపై పోరాటం చేసిన గొప్ప నాయకురాలని ఆమె అన్నారు. తుది శ్వాస విడిచే వరకు ఎర్ర జెండా నీడలో, పేదల పక్షాన నిలిచారని మల్లు స్వరాజ్వం గొప్పతనాన్ని వెల్లడించారు. ఆమె చూపిన పోరాట స్ఫూర్తితో ‘మహిళా హక్కుల కోసం పోరాడుదాం’ అని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు చిత్తారు రమాదేవి, ఇదిగాని అనిత, ఏనుగుల పద్మ, కొండబోయిన రమ్య, ఇదిగాని లింగమ్మ, శ్రావ్య, శారద తదితరులు పాల్గొన్నారు.