Gaddar Awards | హైటెక్స్‌లో గద్దర్ అవార్డుల వేడుక.. జ్యోతి ప్రజ్వలన చేసిన డిప్యూటీ సీఎం, దిల్ రాజు..!
Gaddar Awards : హైదరాబాద్ హైటెక్స్‌లో గద్దర్ ఫిల్మ్ అవార్డు(Gaddar Awards)ల కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Gaddar Awards : హైదరాబాద్ హైటెక్స్‌లో గద్దర్ అవార్డు(Gaddar Awards)ల కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే ఆయా విభాగాల్లో విజేతలను ప్రకటించినా.. తెలుగు సంవత్సరాది తొలిరోజైన ఉగాది పండుగ సందర్భంగా పురస్కారాలను ప్రదానం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
కళాకారుల ప్రతిభకు పట్టం కట్టే ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డులను (2025 సంవత్సరానికి గాను) మార్చి 7వ తేదీన అధికారికంగా ప్రకటించారు. స్పెషల్ జ్యూరీ అవార్డుల వివరాలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలను, షార్ట్ ఫిల్మ్‌లను ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు.
తెలుగు చిత్రసీమకు అందించిన సేవలకు గాను మెగాస్టార్ చిరంజీవి ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’ అందుకోనున్నారు. విలక్షణ నటుడు కమల్ హాసన్‌కు ‘పైడి జయరాజ్’ అవార్డు, సీనియర్ నటి జయసుధకు ‘ఏఎన్నార్ పురస్కారం’, ప్రముఖ నిర్మాత అశ్విని దత్‌కు ‘నాగిరెడ్డి చక్రపాణి’ అవార్డు. గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు ‘సినారే అవార్డు దక్కాయి. ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఉత్తమ చిత్రంగా నిలవగా.. నాగచైతన్య, రష్మిక మందన్న ఉత్తమ నటీనటులుగా ఎంపికయ్యారు.
విజేతలు
ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం – ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
ఉత్తమ నటుడు – నాగ చైతన్య తండేల్
ఉత్తమ నటి – రష్మిక ది (గర్ల్‌ఫ్రెండ్)
ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ ప్రజాదరణ చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ సహాయ నటుడు – శివాజీ (దండోరా)
ఉత్తమ సహాయ నటి – భూమిక (యూఫోరియా)
ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ రాబిన్ (దండోరా)
ఉత్తమ గాయకుడు – అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ గాయని – సాహితీ (కన్నప్ప)
ఉత్తమ బాలనటుడు – మాస్టర్ రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)
నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్: తండేల్.
సామాజిక స్పృహ కలిగిన చిత్రం: కోర్ట్.
ఉత్తమ పరిచయ దర్శకుడు: సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్).
ఉత్తమ బాలల చిత్రం & నటుడు: ‘అనగనగా’ (చిత్రం)
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

