కొత్తపల్లి, డిసెంబర్ 28: కరీంనగర్ జిల్లా మాస్టర్ అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా స్థానిక అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను మేడ్చల్ జిల్లా జట్టు కైవసం చేసుకోగా, రన్నరప్‌ను రంగారెడ్డి జిల్లా జట్టు దక్కించుకుంది.
విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, తెలంగాణ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభుకుమార్ బహుమతులను ప్రదానం చేశారు.