దోహా: భారత వెటరన్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి దోహాలో జరుగుతున్న వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం సొంతం చేసుకుంది. మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆమె.. 11 రౌండ్లకు గాను 8.5 పాయింట్లు సాధించింది.
అలగ్జాండ్ర (రష్యా), జినర్ (చైనా)తో కలిసి సంయుక్తంగా 8.5 పాయింట్లు సాధించినా టైబ్రేకర్ స్కోరు తక్కువగా ఉండటంతో హంపి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ టోర్నీలో హంపికి ఇది ఐదో పతకం కావడం విశేషం.