కరాచీ: ప్రముఖ పాకిస్థానీ కబడ్డీ ఆటగాడు ఉబైదుల్లా రాజ్‌పుత్‌కు ఆ దేశ కబడ్డీ సమాఖ్య షాకిచ్చింది. కొద్దిరోజుల క్రితం బహ్రెయిన్‌లో జరిగిన ఒక ప్రైవేట్ కబడ్డీ టోర్నమెంట్లో ఉబైదుల్లా.. భారత్‌కు చెందిన ఓ జట్టుకు ఆడటమే గాక భారత జాతీయ జెండాను భుజంపై వేసుకున్నాడనే కారణంతో పాకిస్థాన్ కబడ్డీ ఫెడరేషన్ (పీకేఎఫ్) అతడిపై వేటు వేసింది.
ఉబైదుల్లా భారత జెర్సీ, జెండా ధరించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవడంతో వివాదం చెలరేగింది. పీకేఎఫ్ నుంచి ఎన్వోసీ తీసుకోకపోవడంతో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఉబైదుల్లాపై వేటు పడింది.