హైదరాబాద్ : రాష్ట్రంలో వీధి కుక్కలు(Stray dog) చెలరేగి పోతున్నాయి. ఐదేండ్ల లోపు పిల్లలనే లక్ష్యంగా చేసుకుని ప్రతాపం చూపిస్తున్నాయి. కొంత కాలంగా నగరంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి కొనసాగింపుగా ఆదివారం పెద్దఅంబర్‌పేట(Pedda amberpet) మున్సిపాలిటీలోని సూర్య వంశీ గార్డెన్ వద్ద ఇంటి ముందు నిలబడి ఉన్న నాలుగేళ్ల బాలుడు రిషిపై కుక్కలు(Dog attacked) దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు కుక్కలను వెంబడించడంతో ప్రాణపాయం తప్పింది. బాలుడిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. వీధి కుక్కల బారి నుంచి తమను కాపాడాలని, చిన్నారులకు రక్షణ కల్పించాలని మున్సిపాలిటీ అధికారులను స్థానికులు కోరుతున్నారు.