Vadivukkarasi | ఆ వదంతులు నమ్మకండి.. నా ఆరోగ్యం బాగానే ఉంది..!
Vadivukkarasi : సోషల్ మీడియాలో కొన్నిసార్లు అసత్య ప్రచారాలతో ఇబ్బంది పడిన సెలబ్రిటీలు, సినిమా వాళ్లు చాలామందే. తమ గురించిన ఆ తప్పుడు వార్తల్ని వారు స్వయంగా ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా తమిళ చిత్రసీమలో సీనియర్ నటి వడివుక్కరాశి (Vadivukkarasi) కూడా అదే పని చేశారు.
Vadivukkarasi : సోషల్ మీడియాలో కొన్నిసార్లు అసత్య ప్రచారాలతో ఇబ్బంది పడిన సెలబ్రిటీలు, సినిమా వాళ్లు చాలామందే. తమ గురించిన ఆ తప్పుడు వార్తల్ని వారు స్వయంగా ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా తమిళ చిత్రసీమలో సీనియర్ నటి వడివుక్కరాశి (Vadivukkarasi) కూడా అదే పని చేశారు. తాను చనిపోయినట్టు ప్రచారమవుతున్న అసత్య వార్తలను ఆమె ఖండించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, వదంతులు నమ్మొద్దని ఆమె స్పష్టం చేశారు. శ్రేయోభిలాషులు, అభిమానులు ఎవరూ కూడా తన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
తమిళంతో పాటు తెలుగులోనూ పలు చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించిన వడివుక్కరాశి తన ఆరోగ్యంపై ప్రచారమవుతున్న అసత్య వార్తలను ఖండించారు. తాను చనిపోయినట్టు వస్తున్న ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న అబద్దపు కథనాలకు అడ్డుకట్ట వేస్తూ.. నేను బతికే ఉన్నాను, బాగానే ఉన్నాను చెప్పారీ వెటరన్ నటి. ఇటీవల వడివుక్కరాశి ఆరోగ్యం బాగాలేదని, ఆమె చనిపోయారని కొన్ని పోస్ట్లు వెలిశాయి. దాంతో.. అలాంటి అసత్య వార్తలకు చెక్ పెట్టేందుకు ఆమె మీడియా ముందుకొచ్చారు.
அப்படி எல்லாம் இல்லப்பா…! – தான் இறந்ததாக பரவிய வதந்திகளுக்கு முற்றுப்புள்ளி வைத்த நடிகை வடிவுக்கரசி#Vadivukkarasi #TamilCinema #Kollywood #ActorVadivukkarasi #ThanthiTV #ThanthiTVDigital #தந்திடிவிடிஜிட்டல் pic.twitter.com/nao8Uh0IK5
— Thanthi TV (@ThanthiTV) September 19, 2026
థంథి టీవీతో మాట్లాడిన వడివుక్కరాశి.. తన ఆరోగ్యంపై ఆపోహలు వద్దని, తాను బాగానే ఉన్నానని స్పష్టం చేశారు. ‘సోషల్ మీడియాలో పేర్కొన్నట్టు తానేమీ అనారోగ్యంతో బాధ పడడం లేదని వడివుక్కరాశి తేల్చి చెప్పారు. అబద్దపు వార్తలు చూసి.. తన గురించి వాకబు చేసిన శ్రేయాభిలాషులకు, అభిమానులకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
ఐదు దశాబ్దాలుగా
చిత్రసీమలో ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు వడివుక్కరాశి. తమిళం, తెలుగు, మలయాళంతో పాటు.. కన్నడలోనూ ఆమెపలు పాత్రలు పోషించారు. ఇప్పటివరకూ 350కి పైగా సినిమాల్లో, 40కి పైగా టీవీ సీరియళ్లలో నటించారు. సినిమాల్లోకి రాకముందు తను టీచర్గా ఉద్యోగం చేసేవారు. కమల్ హాసన్ ‘సిగప్పు రొజక్కల్’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశారీ వెటరన్. చివరగా తను అర్జున్ దాస్ నటించిన ‘కాన్ సిటీ’లో డబ్బుల కోసం అనారోగ్యంతో బాధ పడే తల్లి పాత్రలో మెప్పించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

