శుక్రవారం 05 జూన్ 2020
Zindagi - Jan 22, 2020 ,

పుస్తకాలకు చెదలు పట్టొద్దంటే..

పుస్తకాలకు చెదలు పట్టొద్దంటే..

  • గాజు అద్దాలపై పడిన మరకలు పోవాలంటే మనం వాడే టూత్‌ పేస్ట్‌ అద్దంపై రాసి పేపర్‌తో కానీ, బట్టతో కానీ తుడవాలి. ఇలా చేయడం వల్ల ఎంతటి మొండి మరకలైనా తొలగిపోతాయి.
  • పుస్తకాలకు పురుగులు, చీడ పట్టకుండా ఉండాలంటే వాటి మధ్య చిన్న గంధపు ముక్క పెట్టాలి. లేదంటే అల్మారా అరల్లో గంధపు పొడి చల్లాలి. ఇలా చేస్తే పుస్తకాలకు పురుగులు, చీడ పట్టకుండా ఉంటుంది.
  • స్విచ్‌ బోర్డులపై నల్ల  మరకలు ఉంటే కిరోసిన్‌లో ముంచిన గుడ్డతో తుడిస్తే మళ్లీ మెరుస్తాయి. లేదా టూత్‌పేస్ట్‌ కాస్త తీసుకొని గుడ్డతో తుడిచినా చాలు.
  • బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలంటే ఎండిన కాకర కాయల్ని ఓ పల్చని వస్త్రంలో మూట కట్టి ఆ మూటని బియ్యం డబ్బాలో వేయాలి. ఇలా చేయడం వల్ల బియ్యంలో పురుగులు పట్టకుండా ఉంటాయి.
  • ఇంట్లోకి ఈగలు, దోమలు రాకుండా ఉండాలంటే.. మనం ఇల్లు తుడిచేటప్పుడు నీళ్లలో కొద్దిగా ఉప్పు కలిపితే ఈగలు, దోమలు రాకుండా ఉంటాయి.


logo