TikTok: టిక్‌టాక్‌ను అమ్మడం లేదు.. అమెరికాకు తేల్చిచెప్పిన చైనా కంపెనీ
TikTok: టిక్‌టాక్‌ను అమ్మడం లేదని అమెరికాకు ఆ కంపెనీ ఓనర్ స్పష్టం చేశారు. బైట్‌డ్యాన్స్ కంపెనీ తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ విషయాన్ని చెప్పింది. టిక్‌టాక్‌ను అమ్మాలని, లేదంటే దాన్ని బ్యాన్ చేస్తామని ఇటీవల అమెరికాలో చట్టాన్ని రూపొందించిన విషయం తెలిసిందే.
బీజింగ్: టిక్‌టాక్(TikTok) ఓ పాపులర్ వీడియో యాప్ అన్న విషయం తెలిసిందే. అయితే ఆ చైనీస్ యాప్‌పై అమెరికాలో ఓ చట్టాన్ని చేశారు. ఆ యాప్‌ను అమ్మివేయాలని లేదంటే బ్యాన్ చేస్తామని ఇటీవల అమెరికా హెచ్చరించింది. ఆ హెచ్చరికల నేపథ్యంలో టిక్‌టాక్ చైనీస్ కంపెనీ బైట్‌డ్యాన్స్ ఓ ప్రకటన చేసింది. టిక్‌టాక్‌ను అమ్మే ఆలోచన లేనట్లు ఆ సంస్థ వెల్లడించింది. బైట్‌డ్యాన్స్ కంపెనీ తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ విషయాన్ని పోస్టు చేసింది. అమెరికా ఉభయసభలు రూపొందించిన చట్టాన్ని కోర్టులో సవాల్ చేయనున్నట్లు ఇటీవల టిక్ టాక్ కంపెనీ తెలిపింది. టిక్‌టాక్‌ను అమ్మే లేదా బ్యాన్ చేసే చట్టంపై బుధవారం అధ్యక్షుడు బైడెన్ సంతకం చేశారు. బైట్‌డ్యాన్స్ కంపెనీపై చైనా ప్రభుత్వ ఆధిపత్యం ఏమీలేదని టిక్‌టాక్ పదేపదే వెల్లడించిన విషయం తెలిసిందే.
అమెరికా కోర్టులో టిక్‌టాక్ గురించి పోరాటం చేస్తామని దాని ఓనర్ షోవూ జి చివ్ తెలిపారు. ఓ ఆన్లైన్ వీడియోలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. బైట్‌డ్యాన్స్‌లో చైనీస్ వ్యవస్థాపకుడికి 20 శాతం మాత్రమే షేర్లు ఉన్నాయి. ఇక మరో 60 శాతం షేర్లు ఇన్వెస్టర్ల వద్ద ఉన్నాయి. దాంట్లో అమెరికా కంపెనీ కార్లిల్ గ్రూపు, జనరల్ అట్లాంటిక్, సుస్కెన్నా ఇంటర్నేషనల్ గ్రూపులు ఉన్నాయి. మరో 20 శాతం షేర్లు కంపెనీ ఉద్యోగుల ఆధీనంలో ఉన్నాయి. బైట్‌డ్యాన్స్‌లో ఉన్న అయిదుగురు బోర్డు సభ్యుల్లో ముగ్గురు అమెరికన్లే ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

