Best Stews | కీమా, కుర్మా, దాల్ తడ్కా..! టేస్ట్ అట్లాస్ బెస్ట్ స్టివ్స్ జాబితాలో తొమ్మిది భారతీయ వంటకాలు..!
Best Stews | భారతీయ వంటకాల రుచులు ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వివిధ రకాల వంటకాలు సంప్రదాయ రుచులు నోరూరిస్తున్నాయి. ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’లో భారతీయ వంటకాలకు ఫిదా అయ్యింది.
Best Stews | భారతీయ వంటకాల రుచులు ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వివిధ రకాల వంటకాలు సంప్రదాయ రుచులు నోరూరిస్తున్నాయి. ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’లో భారతీయ వంటకాలకు ఫిదా అయ్యింది. ఎన్నో రకాల వంటకాలు, డ్రింక్స్‌కు వైబ్సైట్లో స్థానం కల్పించింది. సంస్థ రూపొందించిన ప్రపంచ స్థాయి వంటకాల జాబితా సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో వెబ్సైట్ రూపొందించిన జాబితాలో తొమ్మిది భారతీయ వంటకాలకు స్థానం లభించింది.
ఈ జాబితాలో ‘కీమా’కి టాప్‌టెన్‌లో చోటుదక్కింది. బెంగాల్‌కు చెందిన ‘చింగ్రీ మలాయ్ కర్రీ’ 18వ స్థానంలో నిలిచింది. కుర్మాకు 22, విందాలూ 26, దాల్ తడ్కా 30వ, సాగ్ పన్నీర్ 32, షాహీ పన్నీ 34, మిసాల్ 38వ స్థానంలో నిలిచాయి. ఇక ఇండియన్ దాల్ చివరి స్థానంలో నిలిచింది. తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణాది ప్రాంతాలకు చెందిన వంటకాలకు చోటు దక్కడం విశేషం. ఈ జాబితాలో థాయ్ ఫానెంగ్ కర్నీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంతకు ముందు టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన బెస్ట్ రైస్ పుడ్డింగ్ ర్యాంకుల్లో మూడు భారతీయ స్వీట్స్‌కి చోటు దక్కింది. ఫిర్నీకి 4వ, ఖీర్-పాయసం 5వ స్థానంలో నిలిచింది. చక్కెర పొంగలికి 9వ స్థానం లభించింది. అంతకు ముందు గొర్రె మాంసం వంటకాల్లో కబాబ్‌లకు చోటు కల్పించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

