Health Tips : వేసవిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవాలంటే జీవనశైలి మార్పులతో పాటు షుగర్ లెవెల్స్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుండాలని నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహ బాధితులు వేసవిలో అధికంగా నీరు తాగుతూ డీహైడ్రేషన్ బారినపడకుండా చూసుకోవాలి.
తగినంత నీరు తీసుకుంటే అధిక షుగర్‌ను శరీరం యూరిన్ ద్వారా బయటకు పంపడంతో సరైన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉండే వెసులుబాటు కలుగుతుంది. ఇక పండ్లు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్స్ వంటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకోవాలి.
ఇవి నిదానంగా జీర్ణమవుతూ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను క్రమబద్ధీకరిస్తాయి. కార్బోహైడ్రేట్లను అధికంగా తీసుకోకుండా మానిటర్ చేస్తుండటం కీలకం. బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరగకుండానే తగినంత శక్తిని అందించే తృణ ధాన్యాలు, బీన్స్ వంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలి. ఇక సమ్మర్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ కోసం ఈ టిప్స్ పాటించాలి..
తగినంత నీరు తీసుకోవాలి
లో గ్లైసెమిక్ ఆహార పదార్ధాలు
కార్బోహైడ్రేట్లకు చెక్
శారీరకంగా చురుకుగా ఉండటం
చర్మ సంరక్షణ
ఒత్తిడికి దూరం
నీడ పట్టున ఉండటం
క్రమం తప్పకుండా మందులు వాడటం
Read More :
Sudha Murty | ఓటేయండి.. మీ నాయకుడిని ఎన్నుకోండి.. ఓటర్లకు సుధామూర్తి పిలుపు